What is Insulin?: ఇన్సులిన్ అంటే ఏమిటి? డయాబెటిక్ రోగులకు ఎప్పుడు? ఎందుకు అవసరమో తెలుసుకోండి..
What is Insulin?: ఈ కాలంలో డాయాబెటిస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ షుగర్ వ్యాధి బారిన పడతారు. ఇది రానురాను ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి.
What is Insulin?: ఈ కాలంలో డాయాబెటిస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ షుగర్ వ్యాధి బారిన పడతారు. ఇది రానురాను ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే అవయవాలు పాడయ్యే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. అందుకే ఎప్పటికప్పుడు వైద్యుల సలహా మేరకు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా ఇన్సులిన్ పెప్టైడ్ కేటగిరీకి చెందిన హార్మోన్. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్‌లో ఉత్పత్తి అయ్యే ఒక ప్రత్యేకమైన హార్మోన్. పెప్టైడ్ కేటగిరీ హార్మోన్ ఒకటి బీటా సెల్ అని పిలుస్తారు. ఇందులో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ దానిని కాలేయంలో నిల్వ చేస్తుంది. చక్కెర స్థాయిని నియంత్రించే వరకు దానిని విడుదల చేయదు. మన శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వని వ్యక్తులకు లేదా ఏదైనా శస్త్ర చికిత్సలు చేసుకున్న వారికి ఇన్సులిన్ తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తారు.
ఇన్సులిన్ ఎప్పుడు అవసరం?
ఇన్సులిన్ ముఖ్యంగా శస్త్ర చికిత్స సమయంలో ఆ వ్యక్తులక వైద్యులు సిఫార్సు చేస్తారు. ఇది వారి శరీర అవశ్యకతకు ఇన్సులిన్ సూచిస్తారు.
ముఖ్యంగా ఎన్ని మందులు వాడినా షుగర్ కంట్రోల్ కాలేని వ్యక్తులకు ఇన్సులిన్ ని సిఫార్సు చేస్తారు. అంటే ముఖ్యంగా షుగర్ లెవల్స్ ప్రమాద స్థాయికి చేరినప్పుడు ఇన్సులిన్ వాడతారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిగా వెంకటేష్ వియ్యంకుడు రఘురాం రెడ్డి..
అంతేకాదు గర్భంలో ఉన్నప్పుడు కొంతమంది ఆడవారు డయాబెటిస్ బారిన పడతారు. ఇటువంటి వారికి కూడా వైద్యులు ఇన్సులిన్ సూచిస్తారు. వైద్యులు సూచించిన మోతాదు మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇన్సులిన్ వైద్యలు సూచించిన మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మోతాదుకు మించితే కూడా ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పడిపోవడం జరుగుతాయి. అంతేకాదు ఇన్సులిన్ తీసుకుంటున్న సమయంలో ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.
ఇన్సులిన్ తీసుకునే వ్యక్తులు ఎప్పటికప్పుడు సూది కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. నాణ్యమైన ఇన్సులిన్ మాత్రమే కొనుగోలు చేయాలి. వైద్యుల సిఫార్సు లేనిదే ఇన్సులిన్ తీసుకోకూడదు. ఇది తీసుకున్నాక ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook