Winter Tips: చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం మంచిదా? ప్రమాదకరమా?
Which Is Better In Winter Bath Hot Water Or Cold Water: ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో చన్నీళ్లతో స్నానం అంటే భయపడిపోతారు. అయితే వేడి నీళ్లతో స్నానం చేస్తుంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వేడినీటితో స్నానం చేయడంతో దుష్ఫ్రభావాలు ఉన్నాయి.
Winter Health Tips: చలికాలంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా చలి ఉధృతి పెరుగుతోంది. దేశమంతా గజగజ వణుకుతోంది. అయితే ఈ సమయంలో వేడి నీటితో ఉపశమనం పొందాలనుకుంటున్నారు. అయితే ఒక్క క్షణం. వేడి నీటితో స్నానం చేయడం మంచిదా..? ప్రమాదకరమా? అనేది కొన్ని అధ్యయనాలు కీలక విషయాలు చెబుతున్నాయి. వేడి నీటితో స్నానం చేయడంపై కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఇది చదవండి: Neck Pain: విపరీతమైన స్ట్రెస్ కారణంగా మెడ నొప్పితో బాధపడుతున్నారా? చిన్ని చిట్కాతో చెక్..
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రరూపం దాల్చింది. ఈ సమయంలో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో అని కొందరు పరిశీలిస్తున్నారు. వేడి నీటితో స్నానం చేయడం చేస్తుంటారు. అయితే చర్మ సంరక్షణకు మాత్రం వేడి నీటి శ్రేయస్కరం కాదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. వేడి నీటితో స్నానం వలన చర్మ సౌందర్యం పోతుందని హెచ్చరిస్తున్నారు. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. ముఖం, చేతులు, శరీరం పొడిబారడం వెనుక ఉన్న వాస్తవాలు ఇలా ఉన్నాయి.
ఇది చదవండి: Hing Uses: దగ్గు నుంచి డయాబెటిస్ వరకు అనేక సమస్యలకు చెక్ పెట్టే ఇంగువ లాభాలు ఇవే..
చలికాలంలో ముఖం పొడిబారుతుంది. చర్మంలోని జిడ్డు పొడిబారడం, కొవ్వు ద్రవాలు గడ్డకట్టడంతోనే చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంది. దీనిని నివారించడానికి వేడి నీటిలో స్నానం చేయకూడదు. వేడి నీళ్లలో స్నానం చేయడంతో చర్మకణాలు విస్తరిస్తాయి. అవి బయటకు రాగానే చర్మకణాలు కుంచించుకుపోతాయి. దీని కారణంగానే 98.4% ఉష్ణోగ్రత ఉన్న సాధారణ నీటిలో స్నానం చేయడం మేలు. చలికాలంలో కొన్ని జాగ్రత్తలతో తలస్నానం చేస్తే చర్మం మునుపటిలా మెరుస్తుంది. వీటితోపాటు రక్తపోటు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. మొటిమల సమస్య వస్తుందని.. గజ్జి తామర వంటి చర్మ సమస్య కూడా వస్తుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వేడినీటితో చేసిన వారందరికీ ఈ సమస్యలు వస్తాయని కాదు. వారివారి శారీరక పరిస్థితిని బట్టి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చిట్కాలు
చర్మం మెరవాలంటే చలికాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇంట్లోని పసుపు, శెనగపిండి వంటి వాటితో చర్మ సంరక్షణ సాధ్యమవుతుంది. క్రమం తప్పకుండా చర్మం సంరక్షించే క్రీములు వాడాలి. చర్మం పొడిబారితే అలాగే వదిలేయడంతో రక్తం కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. నిత్యం వాజిలెన్ వంటివి రాస్తూ ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe Twitter, Facebook
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.