కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది మరణిస్తున్నారు. మరోవైపు కోవిడ్-19 వ్యాక్సిన్ ను కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక పెద్ద ఫార్మా సంస్థలతో కలిసి ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. అదే సమయంలో రష్యా తన వ్యాక్సిన్ ను ( Russian Covid-19 Vaccine ) ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: N-95 Mask: ఎన్ 95 మాస్కును ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఇలా క్లీన్ చేయోచ్చు


భారత్ లో వచ్చే ఏడాది జనవరిలోపు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అంటే ఇంకా కొంత కాలం మనం కరోనావైరస్ సంక్రమించకుండా ఉండాలి అంటే తప్పుకుండే కోవిడ్-19 రూల్స్ ( Covid-19 Rules ) పాటించాలి. అందులో భౌతిక దూరం, మాస్కు ధరించడం,  చేతులు శుభ్రంగా కడగడం వంటి నివారణ చర్యలు చాలా ముఖ్యమైనవి. అయితే మనలో చాలా మంది ఏదో పేరుకే మాస్కు వేసుకున్నాం అన్నట్టు ధరిస్తోండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organization ) దీనిపై ఒక క్లారిటీ ఇవ్వడానికి ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో మాస్కు ధరించే సమయంలో మనం చేస్తున్న పొరపాట్లు.. వాటిని సరిదిద్దడానికి పాటించాల్సిన అంశాలను తెలిపింది.


Also Read:  Chyavanprash: చ్యవన్ ప్రాష్ వల్ల ఇమ్యూనిటీ పెరగుతుంది..ఇన్ఫెక్షన్స్ దరి చేరవు


ఈ వీడియోను మీరు కూడా చూడండి.



 


1.మాస్కు లూజ్ గా ధరించడం 
మనం సేఫ్టీ  కోసం మాస్క్ ధరిస్తున్నాం.. కానీ అనేక సార్లు దాన్ని చేతులతో టచ్ చేస్తున్నాం. దాన్ని దవడ, మెడ భాగానికి లాగుతున్నాం. దీంతో ప్రమాదం మరింతగా పెరిగే అవకాశం ఉంది. కరోనావైరస్ సంక్రమణ( Covid-19 ) నుంచి దూరంగా ఉండాలి అంటే మాత్రం మీకు ఫిట్ అయ్యే మాస్కు ధరించండి. ముక్కు నుంచి దవడ బాగం వరకు కవర్ అయ్యే మాస్కును తీసుకోండి.


Also Read: ​ Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే


2. ముక్కును కవర్ చేయకపోవడం
చాలా మంది మాస్కును ధరిస్తారు కానీ.. దాంతో ముక్కును కవర్ చేయరు. నిజానికి ఈ వైరస్ ఎక్కువగా ముక్కు, నోటి నుంచే శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలాంటి సమయంలో ముక్కును కవర్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే మాస్కును సరిగ్గా ధరించడండి. ముక్కును తప్పకుండా కవర్ చేసుకోండి. 


3. మాట్లాడే సమయంలో మాస్క్ తీసేయడం
చాలా మంది మాస్కు వేసుకున్నా.. మాట్లాడే సమయంలో మాత్ర మాస్కు తీసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వైరస్ ( Virus ) సంక్రమణ జరిగే అవకాశం ఉంది.  అందుకే మాట్లాడే సమయంలో తప్పకుండా మాస్క్ ధరించండి. అలవాటులో పొరపాటుగా తీసేయకండి.


4. మాస్కును మాటి మాటికీ టచ్ చేయడం
చాలా మంది మాస్కును మాటిమాటికీ టచ్ చేస్తుంటారు. దీని వల్ల చేతికి ఉన్న మురికి ముఖానికి వేసుకునే ముసుగుకు తగిలే అవకాశం ఉంది. ఈ పొరపాటు అస్సలు చేయకండి. మీ ముందు ఎవరైనా తమ మాస్కును మాటిమాటికీ టచ్ చేస్తోంటే.. దాని వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో తెలియజేయండి. ముఖ్యంగా పిల్లలకు మాస్కు సరిగ్గా ధరించే విధానాన్ని నేర్పించండి. 


Also Read: How To Download Arogya Setu: ఆరోగ్య సేతు యాప్ ఎలా డౌన్ లోడ్ చేయాలి ? ఆపరేటింగ్ ఎలా?


5. ఇతరుల మాస్కు ధరించకండి
ఇంట్లో సభ్యులు అయినా.. బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఒకరి మాస్కు మరొకరు ధరించడం చేయరాదు. ఇలా చేయడం వల్ల వైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR