Traffic Restrictions In Hyderabad: న్యూఇయర్ వేడుకల వేళ భాగ్యనగరంలో ప్రత్యేక ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ సీపీ తెలిపారు. ఈ మేరకు పైవంతెన, ఔటర్‌రింగ్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 10 నుంచి రేపు ఉదయం 6గంటల వరకు అనుమతి నిరాకరించారు. శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వాహనదారులకు పాసులు తప్పనిసరి చేశారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని ట్రాఫిక్ పోలీసుల సూచించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కేసులు పెడతాం సీపీ అన్నారు. పబ్, క్లబ్బుల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే యజమానిపై చర్యలు తీసుకుంటాని చెప్పారు. మద్యం సేవించిన కస్టమర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీపీ సూచించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు ట్రాఫిక్ పోలీసులు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. క్యాబ్, ఆటో డ్రైవర్స్ రైడ్స్ నిరాకరించొద్దని ఈ సందర్భంగా చెప్పారు. 


Also Read: హ్యాండ్ గ్లవ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు సజీవదహనం..


ఈరోజు రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించనున్నట్లు డీజీపీ తెలిపారు. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష విధించనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి దాటాక సంబరాలు పేరుతో ఇష్టానుసారం యువత రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. 


Also Read: ISRO: న్యూ ఇయర్ వేళ ఇస్రో నూతన ప్రయోగం.. పీఎస్‌ఎల్వీ-సీ58 కౌంట్‌డౌన్‌ స్టార్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook