ISRO: న్యూ ఇయర్ వేళ ఇస్రో నూతన ప్రయోగం.. పీఎస్‌ఎల్వీ-సీ58 కౌంట్‌డౌన్‌ స్టార్ట్..

ISRO: పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ను నింగిలోకి పంపించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించనుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో). ఈ నేపథ్యంలో ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ మెుదలైంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2023, 10:10 AM IST
ISRO: న్యూ ఇయర్ వేళ ఇస్రో నూతన ప్రయోగం.. పీఎస్‌ఎల్వీ-సీ58 కౌంట్‌డౌన్‌ స్టార్ట్..

PSLV-C58 XPoSat Mission: ఈ సంవత్సరం చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 మిషన్లను విజయవంతంగా ప్రయోగించి భారత్ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు చూపింది ఇస్రో. అదే ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని మరో ప్రయోగంతో ఘనంగా ప్రారంభించేందుకు రెడీ అయింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. సోమవారం ఉదయం 9.10 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) లోని మెుదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ-సీ58 (PSLV-C58) రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ క్రమంలో ప్రయోగానికికి సంబంధించిన కౌంట్ డౌన్ ను ప్రారంభించింది ఇస్రో. ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ సోమవారం ఉదయం 9.10 గంటల వరకు కొనసాగుతోంది. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్ లో తాజా ప్రయోగం 60వది కావడం విశేషం. 

ఈ ప్రయోగం ద్వారా మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం(ఎక్స్‌పోశాట్‌)ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం దీని ఈ శాటిలైట్‌ ప్రధాన లక్ష్యం. దీని జీవితకాలం 5 ఏళ్లు. 469 కిలోల బరువు గల ఎక్సోపోశాట్ ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కిమీ ఎత్తులోని లియో ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ఈ క్రమంలోనే ప్రయోగ సమయాన్ని, కౌంట్ డౌన్ సమయాన్ని ప్రకటించారు. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో పూర్తి చేయనున్నారు. పీఎస్ఎల్వీ రాకెట్ సీ58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు, 260 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 

Also read: Maharashtra fire: హ్యాండ్ గ్లవ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు సజీవదహనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News