New COVID-19 Strain In India Updates: భారత్‌లో రెండు కరోనా వైరస్ వ్యాక్సిన్లకు డీసీజీఐ ఆమోదం తెలపడంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త వైరస్ స్ట్రెయిన్ సైతం ఆందోళనను రేకెత్తిస్తోంది. యూకేలో పుట్టుకొచ్చిన కొత్త వైరస్ కేసులు ప్రస్తుతం 30 దేశాలకు విస్తరించాయి. తాజాగా యూకే నుంచి వచ్చిన వారిలో 20 మందిలో కొత్త కోవిడ్-19 స్ట్రెయిన్ వైరస్‌ గుర్తించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా కేసులతో కలిపితే భారత్‌లో మొత్తం కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య 58కి పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం వెల్లడించింది. తాజాగా కొత్త వైరస్ గుర్తించిన వ్యక్తులను ఐసోలేషన్‌లో ఒక్కో గదిలో ఉంచినట్లు తెలిపారు. వారిని ప్రత్యేకంగా పరిశీలిస్తూ, చికిత్స అందిస్తున్నామని వైద్యశాఖ వివరించింది. 
 




కొత్త  కరోనా వైరస్(CoronaVirus) కేసులు గుర్తించిన పేషెంట్ల కుటుంబ సభ్యులతో పాటు కాంటాక్ట్‌ అయిన వారిని క్వారంటైన్‌లో ఉంచారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(NCDC) 8 కేసులు గుర్తించగా, ఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆప్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(IGIB) 11 కేసులు, బెంగళూరులో మిగతా కేసులు గుర్తించినట్లు సమాచారం.


Also Read: IIT JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీల ప్రకటనపై అప్‌డేట్



కాగా, దేశంలో కరోనా కేసులు కొన్నిరోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 16వేల COVID-19 కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో కొత్తగా 16,375 కరోనా కేసులు నమోదు కాగా, 201 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,56,845కి చేరింది. కోవిడ్-19 మరణాల సంఖ్య 1,49,850కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


Also Read: Credit Card Tips: ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి



భారత్‌తో పాటు డెన్మార్క్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ లాంటి దేశాలలో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసుల్ని గుర్తించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook