Cyclone Asani: ఈ ఏడాది భారత్‌ను తాకడానికి తొలి తుఫాన్ దూసుకొస్తోంది. నైరుతి హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని.. వచ్చే వారం ప్రారంభంలో అది తుఫానుగా మారుతుందని భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) ఇది వరకే హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో ఈ తుఫాన్ మార్చి 21న ఏర్పడనుంది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపై (Andaman and nicobar islands) అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్కడ బలమైన ఈదురుగాలులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాను బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వైపు కదులుతుందని గత వారం IMD అంచనా వేసింది. ఏదేమైనా తుఫాన్ యెుక్క ప్రభావం తూర్పు, ఈశాన్య భారతంపై ఉండే అవకాశం కనిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 19న, దక్షిణ అండమాన్ సముద్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు/ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్ మరియు నికోబార్ దీవులలోని కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇది మార్చి 20న అల్పపీడనంగా మారి..మార్చి 21వ తేదీన 'అసని' తుఫానుగా (Cyclone Asani) రూపాంతరం చెందుతుందని అధికారులు పేర్కొన్నారు. 


మార్చి 18 వరకు బంగాళాఖాతం, భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంలో గంటకు 40-50 కి.మీ నుండి 60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మార్చి 21 నాటికి గాలి వేగం క్రమంగా పెరుగుతుందని అంచనా. అండమాన్, నికోబార్ దీవులు మరియు బంగాళాఖాతంలో గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మార్చి 23న బంగాళ ఖాతం, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీరాల్లో గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 


Also Read: Summer Effect: ఏపీ, తెలంగాణల్లో మండుతున్న ఎండలు, మార్చ్ 21 న తుపాను..విచిత్ర పరిస్థితి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook