దేశమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు పబ్లిక్ పరీక్షల్ని రద్దు చేసేశాయి. విద్యార్ధుల భవిష్యత్ దృష్ట్యా కొన్ని రాష్ట్రాలు పరీక్షల్ని నిర్వహించలేదు. అయితే కర్ణాటక మాత్రం పదో తరగతి పరీక్షల్ని నిర్వహించింది. ఫలితం ఆ విద్యార్ధులకు ప్రాణ సంకటంగా మారింది. ఏకంగా 32 మంది పదో తరగతి విద్యార్ధులకు కరోనా సోకినట్టు వెల్లడి కావడంతో కర్నాటకలో ఇప్పుడు కరోనా కలవరం రేగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కర్ణాటకలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వాస్తవానికి మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 9 మధ్యలో జరగాల్సి ఉంది.అయితే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాయిదా పడిన పరీక్షల్ని జూన్ 25 నుంచి జూలై 3 మధ్యకాలంలో తిరిగి నిర్వహించింది. ఈ పరీక్షల నిర్వహణలో సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్ ను పూర్తిగా దృష్టిలో పెట్టుకునేలా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అయితే పరీక్షల్ని నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అటు ప్రతిపక్షాలు, ఇటు తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. పిల్లల భవిష్యత్ పై ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం పగడ్భంధీ చర్యలతో పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించగలిగింది. అయితే ఇప్పుడా విద్యార్ధులకు  కరోనా సోకడంతో విద్యార్ధుల భవిష్యత్ పై ప్రశ్నలు  రేగుతున్నాయి. పదో తరగతి పరీక్షలు రాసిన 32 మంది విద్యార్ధులకు ఇప్పటివరకూ కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. Also read: ICAI CA: సీఏ మే పరీక్షలు రద్దు. నవంబర్ లో నిర్వహణకు నిర్ణయం


రాష్ట్రంలో 7 లక్షల 61 వేల 506 మంది విద్యార్ధులు ఎస్ ఎస్ ఎల్ సీ ( Secondary school leaving certificate ) ( SSLC)  పరీక్షలు రాశారు. వీరిలో 32 మందికి కరోనా వైారస్  సోకింది. ఈ 32 మందితో కాంటాక్ట్ లో ఉన్నవారిని కూడా పరీక్షించి అవసరమైతే క్వారంటైన్ కు తరలిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 80 మంది విద్యార్ధుల్ని హోమ్ క్వారెంటైన్ కు తరలించినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కంటెయిన్మెంట్ జోన్లలో నివసిస్తున్న 3 వేల 911 మంది విద్యార్ధులు, ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా మరో 863 మంది విద్యార్ధులు ఈ యేడాది పదో తరగతి పరీక్షలు రాయలేదని తెలిసింది. Also read: NEET, JEE EXAMS 2020: జేఈఈ, నీట్ పరీక్షలు సెప్టెంబర్ వరకు వాయిదా


32 మందికి కరోనా వైరస్ సోకడంతో...ఇవే సెంటర్లలో పరీక్షలు రాసిన మిగిలిన విద్యార్ధుల ఆరోగ్యంపై తల్లిదండ్రులకు ఇప్పుడు ఆందోళన పట్టుకుంది.