దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ( Bihar Assembly Elections ) తొలిదశ పోలింగ్ ( First phase polling ) ప్రశాంతంగా ముగిసింది. 71 నియోజకవర్గాలకు  జరిగిన ఎన్నికల్లో 54 శాతం పోలింగ్ నమోదైంది. మరో రెండు దశల పోలింగ్ మిగిలుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బీహార్ అసెంబ్లీకు మూడు దశల్లో ( Bihar Elections in 3 phases ) పోలింగ్ జరగాల్సి ఉంది. ఇవాళ అంటే అక్టోబర్ 28న తొలిదశ పోలింగ్ జరగగా..రెండవ దశ పోలింగ్ నవంబర్ 3న, మూడవ దశ నవంబర్ 7న జరగనుంది. నవంబర్ 10 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఇవాళ జరిగిన తొలిదశ పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసినట్టు తెలుస్తోంది. అయితే పోలింగ్ శాతం మాత్రం చాలా తక్కువగా నమోదైంది. తొలిదశలో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మందకొడిగానే సాగింది. తొలిదశలో కేవలం 54 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 


71 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 1 వేయి 66 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. వీరిలో 952 మంది పురుషులు, 114 మంది మహిళలున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఓ గంట ముందుగానే పోలింగ్ ముగించారు. కరోనా వైరస్ నేపధ్యంలో పూర్తిగా కోవిడ్ 19 ( Covid19 )  నిబంధనలను అనుసరించి ఎన్నికలు నిర్వహించారు. ఇవాళ జరిగిన మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 2 కోట్ల 15 లక్షల మంది ఓటర్లున్నారు.  వీరిలో 1 కోటి 12 లక్షల మంది పురుషులు కాగా..1 కోటి లక్ష మంది మహిళలలున్నారు. అటు 599  ట్రాన్స్‌జెండర్ ఓట్లు కూడా ఉన్నాయి. 78 వేల 6981 సర్వీస్ ఓట్లున్నాయి. తొలిదశ పోలింగ్ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో జరిగింది. మొత్తం 1 వేయి 66 మంది అభ్యర్దుల భవితవ్యం ఈవీఎం ( EVM ) లలో నిక్షిప్తమైంది.


కోవిడ్ నిబంధనల నేపధ్యంలో ఒక్కొక్క పోలింగ్ బూత్‌కు 1000 నుంచి 1600 మంది ఓటర్లను కేటాయించారు. 80 సంవత్సరాలు దాటిన వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ( Postal Ballot ) సౌకర్యాన్ని కల్పించారు. అంతేకాకుండా ఈవీఎంల శానిటైజేషన్, ఎన్నికల సిబ్బంది,  ఓటర్లకు తప్పనిసరి మాస్క్ ధారణ, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ శానిటైజర్, సబ్బునీళ్లు అన్నీ అందుబాటులో ఉంచారు.  


ఇవాళ జరిగిన 71 నియోజకవర్గాల్లో 33 శాతం నియోజకవర్గాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో భద్రత పెంచారు. ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో గంట ముందుగానే ఓటింగ్ ప్రక్రియను ముగించారు. తొలిదశ పోలింగ్ కోసం 31 వేల 371 పోలింగ్ స్టేషన్లు వినియోగించారు. నక్సల్, సమస్యాత్మకం కావడంతోనే పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదైనట్టు తెలుస్తోంది. Also read: Covid19 : 80 లక్షల మార్క్ చేరువైన ఇండియా కరోనా వైరస్ కేసులు