MBBS @ 64: కుమార్తె జ్ఞాపకార్ధం..64 ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్
చదువుకు వయస్సుతో సంబంధం లేదు. చదువనేది ఓ నిరంతర ప్రక్రియ. అందుకే విశ్రాంతి తీసుకోవల్సిన వయస్సులో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఆ వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
చదువుకు వయస్సుతో సంబంధం లేదు. చదువనేది ఓ నిరంతర ప్రక్రియ. అందుకే విశ్రాంతి తీసుకోవల్సిన వయస్సులో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఆ వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రిటర్మెంట్ అనేది మనిషి జీవితంలో ఓ అనివార్య ప్రక్రియ. ఏళ్ల తరబడి ఉద్యోగం చేశాక..రిటైరయ్యాక హాయిగా మిగిలిన కొద్ది కాలం గడపాలనేది సగటు మనిషి ఆలోచన. కానీ ఒడిశా ( Odisha )కు చెందిన కిశోర్ ప్రధాన్ అలా చేయలేదు. 64 ఏళ్ల లేటు వయస్సులో ఏకంగా వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉందా..ఇవీ వివరాలు..
ఒడిశాకు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కిశోర్ ప్రధాన్ ( Kisore pradhan ) ఇప్పుడు బర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. డాక్టర్ అవ్వాలన్న చిరకాల కోరిక ఓ వైపు, కూతురి జ్ఞాపకంగా మరోవైపు కష్టపడి నీట్ రాశారు. 175 మార్కులతో 5 లక్షల 94 వేల 380 స్కోర్ సాధించి మెడికల్ కాలేజిలో చేరారు.
1975లో ఇంటర్మీడియట్ అనంతరం ఎంబీబీఎస్ ( MBBS ) ఎంట్రన్స్ రాశారీయన. సీటు రాకపోవడంతో బీఎస్సీలో చేరి..తరువాత బ్యాంకు ఉద్యోగంలో స్థిరపడ్డారు. 15 ఏళ్ల అనంతరం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరోసారి ప్రయత్నిద్దామనుకున్నారు. కానీ కుటుబం గడవడం కష్టమవుతుందని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇద్దరు కూతుర్లు నీట్ ప్రిపేర్ అవుతుంటే తాను కూడా ప్రయత్నం ప్రారంభించారు. 2019 లో సుప్రీంకోర్టు ( Supreme court ) తాత్కాలికంగా నీట్ పరీక్ష వయోపరిమితిని తొలగించడంతో తన ప్రయత్నం కొనసాగించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్‌గా 2016లో రిటైర్ అయిన కిశోర్ ప్రధాన్..అనుకున్నది సాధించారు. దురదృష్టవశాత్తూ ఇటీవల ఒక కూతురు మరణించడంతో...ఆమెకు గుర్తుగానైనా ఎంబీబీఎస్ చదువును కొనసాగిస్తానంటున్నారు కిశోర్ ప్రధాన్.
Also read: Rajinikanth: ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్