7th Pay Commission DA Hike Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కొంతమంది ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ బోర్డు స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు, సూపర్‌వైజర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 1వ తేదీ నుంచి పెంచిన డీఏ వర్తించనుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెలకు రూ.3,500 వరకు ప్రాథమిక వేతనం పొందుతున్న ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ 701.9 శాతం అంటే రూ.15,428 జీతం లభిస్తుంది. నెలవారీ జీతం రూ.3,501 నుంచి రూ.6,500 పొందుతున్న ఉద్యోగులకు డీఏ 526.4 శాతంగా ఉంటే కనిష్టంగా రూ.24,567గా ఉంటుంది. రూ.6,501 నుంచి రూ.9,500 బేసిక్ వేతనం ఉన్నవారికి 421.1 శాతం డీఏ చొప్పున కనీసం రూ.34,216 అందుకుంటారు. 


9500 కంటే ఎక్కువ బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ 351 శాతం ఉంటుంది. ఇది కనిష్టంగా రూ.40,005 అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ గణన ప్రస్తుత రేటు డీఏ, బేసిక్ శాలరీ ఆధారంగా జరుగుతోంది. లెక్కింపులో 50 పైసలు లేదా అంతకంటే ఎక్కువ వస్తే మొత్తం కలిపి రూపాయికి రౌండాఫ్ చేస్తారు. 50 పైసలు కంటే తక్కువ లెక్కింపు వస్తే.. ఆ మొత్తాన్ని పరిగణలోకి తీసుకోరు. 


డీఏ రూ.150.75 అయితే.. 151 రూపాయలుగా లెక్కిస్తారు. రూ.150.45 అయితే రూ.150గా మాత్రమే పరిగణిస్తారు. పాత విధానంలో పాయింట్‌కు రూ.2 లెక్కిస్తారు. ఏఐసీపీఐ కార్యవర్గానికి 16215.75 రూపాయల డీఏ అందుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని అడ్మినిస్ట్రేటివ్ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లు తమ అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉన్న సీపీఎస్‌ల దృష్టికి డీఏ పెంపు వివరాలు వెల్లడించాలని సూచించింది. 


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు 42 శాతం డీఏ అందుతుండగా.. ఈసారి కూడా 4 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం డీఏ 46 శాతానికి పెరుగుతుంది. డీఏతో పాటు రిటైర్‌ అయిన ఉద్యోగులకు డీఆర్‌ కూడా పెరుగుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ, డీఆర్‌ను ఎప్పటికప్పుడు పెంచుతున్న విషయం తెలిసిందే. 


Also Read: Tax Refund Status: ఐటీఆర్ ఫైల్ చేశారా..? రీఫండ్ స్టాటస్‌ను ఇలా చెక్ చేసుకోండి  


Also Read: Gas Bill Offers 2023: గ్యాస్ బిల్లుల చెల్లింపులపై బంపర్ ఆఫర్స్.. ఈ ప్రోమో కోడ్‌లను వాడుకోండి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి