Man wanted to sleep with the wife of his friend found dead: నేవి ముంబైలో శమకాంత్ తుకారాం నాయక్ అనే ఓ 80 ఏళ్ల వృద్దుడు ఆగస్టు 29 నుంచి కనిపించకుండాపోయాడు. మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన నాయక్ ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని అతడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడికి కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండటంతో ప్రాపర్టీ విషయంలోనే పడని వారే మర్డర్ (Murder) చేసి, శవం కూడా కనిపించకుండా చేసి ఉంటారని పోలీసులు భావించారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా అక్కడి సీసీటీవీ ఫుటేజీ (CCTV footage) పరిశీలిస్తున్న పోలీసులకు ఓ క్లూ లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు 31న ఓ వ్యక్తి త ఒక శవాన్ని తన దుకాణంలోంచి బయటికి తీసి బెడ్‌షీట్‌లో చుట్టి బైకుపై తీసుకెళ్తుండగా రికార్డ్ అయిన దృశ్యం పోలీసుల కంట పడింది. ఆ వీడియోలో ఉన్న ఆ వ్యక్తి మరెవరో కాదు... నాయక్ కనిపించడం (Missing complaint) లేదని పోలీసులకు ఫిర్యాదుచేయడానికి వెళ్లినప్పుడు అతడితో కలిసి పోలీస్ స్టేషన్‌కి వచ్చిన వ్యక్తే అని పోలీసులు గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు నేరం బయటపడటమే కాకుండా అప్పటివరకు నాయక్ కుటుంబసభ్యులకు, బయటి ప్రపంచానికి తెలియని మరో సంచలన విషయం కూడా వెలుగుచూసింది. 


Also read : Rape on cows : ఆవులపై అత్యాచారం.. భరించలేక అమ్ముకుంటున్న రైతులు! ఎక్కడో తెలుసా?


న్యూస్ 18 ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. బైక్‌పై ఆ 33 ఏళ్ల వ్యక్తి తీసుకెళ్లింది నాయక్ శవాన్నే అని పోలీసుల విచారణలో తేలింది. తానే నాయక్ ని చంపేసినట్టు ఆ నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అయితే, అంతకంటే ముందుగా తాను ఆ నేరం ఎందుకు చేయాల్సి వచ్చిందనే వివరాలు కూడా వెల్లడించాడు. తరచుగా తన దుకాణానికి వచ్చే నాయక్ తన భార్యపై (Wife) కన్నేశాడని పోలీసులకు తెలిపాడు. 


ఆగస్టు 29న కూడా అలాగే తన దుకాణానానికి వచ్చిన నాయక్.. '' నీ భార్యను నా గోడౌన్‌కి పంపిస్తే.. రూ. 10 వేలు ఇస్తాను'' అని నాతో చెప్పాడు. నాయక్ మాటలకు కోపం వచ్చిన తాను అతడిని తోసేశాను. కిందపడిన నాయక్ తలకు గాయమైంది. ఆ తర్వాత దుకాణం షటర్ కిందికి దించి అతడికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశానని నిందితుడు తన నేరాన్ని (Crime news) అంగీకరించాడు. నాయక్ శవాన్ని మాయం చేయడం కోసం సరైన సమయం కోసం వేచిచూశానని, అలా ఆగస్టు 31న తెల్లవారి జామున 5 గంటలకు శవాన్ని చెరువులో పడేసేందుకు దుప్పట్లో చుట్టి బైకుపై తీసుకెళ్లానని అంగీకరించాడు.


Also read : Facebook swamiji: పూజలు చేసి పాస్‌ చేయిస్తాని.. MBBS student ని మోసం చేసిన దొంగ బాబా