ఇండియాలో కరోనా వైరస్ ( Coronavirus in india ) పీక్స్ కు చేరుతోందా..ఇక తగ్గడమే మిగిలిందా..2021 ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా వైరస్ ( Coronavirus may end by 2021 February ) అంతమైపోతుందా..కేంద్రం స్పష్టం చేసింది. అయితే మరింత మందికి కరోనా వైరస్ సోకుతుందని మాత్రం ఆ కమిటీ హెచ్చరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ( Coronavirus ) అధికంగా ఉన్నదేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉంది. అమెరికా ( America ) అనంతరం రెండో స్థానంలో ఇండియా ఉండగా..మూడో స్థానంలో బ్రెజిల్ ఉంది. దేశంలో ఇప్పటికే 90 శాతం మంది ప్రజలు కరోనా వైరస్ వ్యాధికి గురైనట్లు నిపుణులు చెబుతున్న మాట. సెప్టెంబరు 17 న దేశంలో అత్యధిక సంఖ్యలో యాక్టివ్ కేసులు 10 లక్షల 17 వేలుంగా.. తరువాత ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ 7 లక్షల 83 వేలకు  చేరుకుంది. ఇప్పటి వరకూ దాదాపు 66 లక్షల మంది రోగులు కోలుకున్నారు. శనివారం దేశంలో 61 వేల 893 కేసులు నమోదు కాగా 72 వేల 583 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో  మొత్తం కేసుల సంఖ్య 74 లక్షల 92 వేలుగా ఉంది. ఒక్క శనివారం నాడే కరోనా వైరస్ కారణంగా 1 వేయి 31 మంది మరణించగా.. ఇప్పటివరకూ దేశంలో 1 లక్షా 14 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. Also read: Self Obituary: మరణానికి ముందే స్వయం లిఖిత సంస్మరణ ప్రకటన


ఇండియాలో కరోనా వైరస్‌ ముమ్మర ద అంటే కీలకదశను దాటిందని... వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మహమ్మారి అంతం అవుతుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. అయితే ప్రజలు మాత్రం కోవిడ్‌-19 నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధింగా పాటించాలని కోరింది. ఫిబ్రవరి నాటికి వైరస్ అంతమయ్యేసరికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు కోటి 5 లక్షలకు చేరుకుంటుందని కమిటీ అంచనా వేసింది.


ఇక శీతాకాలంలో భారత్‌లో రెండో విడత కరోనా వైరస్‌ కేసుల ఉధృతి ( Covid Second Wave ) పెరిగే అవకాశం లేకపోలేదని నీతి ఆయోగ్ ( Neeti ayog )‌ సభ్యులు వీకే పాల్‌ ఇప్పటికే హెచ్చరించారు. అందుకే వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి రాగానే పౌరులందరికీ అందుబాటులో తీసుకొచ్చేలా అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. శీతాకాలంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశమున్నందున ప్రజలు జాగ్రత్తతో ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. 


గత మూడు వారాల్లో కొత్త కరోనా వైరస్‌ కేసుల నమోదు, మరణాల సంఖ్య తగ్గినట్లు కేంద్రం తెలిపింది. అయితే, సెకండ్‌ వేవ్‌ను తోసిపుచ్చలేమని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఇండియాలో మాత్రం ఇప్పటివరకూ కరోనా వైరస్‌లో ఎలాంటి మార్పు ( మ్యూటేషన్ ) లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఇంతవరకూ కరోనా వైరస్ మార్పు జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు లేవని చెప్పారు. 


కోవిడ్-19 వాక్సిన్‌కు ( Covid19 vaccine ) సంబంధించి ఇండియాలో ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయని, సీరం ఇనిస్టిట్యూట్ ( serum institute ) , భారత్ బయోటెక్ ( Bharat Biotech )‌లు క్లినికల్ ట్రయిల్స్ జరుపుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. Also read: Delhi: అక్టోబర్ నెలలో కాలుష్యం ఎందుకు పెరుగుతుంటుంది?