Self Obituary: మరణానికి ముందే స్వయం లిఖిత సంస్మరణ ప్రకటన

బతికుండగానే విగ్రహాలు పెట్టించుకున్న సంఘటనలు చూశాం. బతికుండగానే సమాధి ఎలా ఉండాలో కట్టించుకుని చూసేవారిని చూశాం. కానీ మరణానంతరమిచ్చే సంస్మరణ ప్రకటనను స్వయంగా రాసుకున్న ఆ వ్యక్తిని చూశారా..ఇండియాలోనే జరిగింది. ఇప్పుడు వైరల్ అవుతోంది.

Last Updated : Oct 18, 2020, 02:32 PM IST
Self Obituary: మరణానికి ముందే స్వయం లిఖిత సంస్మరణ ప్రకటన

బతికుండగానే విగ్రహాలు పెట్టించుకున్న సంఘటనలు చూశాం. బతికుండగానే సమాధి ఎలా ఉండాలో కట్టించుకుని చూసేవారిని చూశాం. కానీ మరణానంతరమిచ్చే సంస్మరణ ప్రకటన ( Self Obituary before Death ) ను స్వయంగా రాసుకున్న ఆ వ్యక్తిని చూశారా..ఇండియాలోనే జరిగింది. ఇప్పుడు వైరల్ అవుతోంది.

మనిషి జీవితానంతరం ఆ మనిషి చేసుకున్న పనుల్ని బట్టి నలుగురూ నాలుగు కాలాల పాటు చెప్పుకుంటారని అంటారు పెద్దలు. పుణ్యకార్యాలు చేస్తే మంచిగా..చెడు కార్యాలు చేస్తే చెడ్డగా చెప్పుకోవడం సహజం. మరోవైపు బతికుండగానే విగ్రహాలు కట్టించుకునేవారిని, సమాధి సెట్టింగ్ చూసుకునేవారిని కూడా చూశాం. కానీ చెన్నై ( Chennai ) కు చెందిన ఆ వ్యక్తి కాస్త భిన్నంగా ఆలోచించి మరణానంతరం వార్తల్లోకెక్కాడు. దీనికోసం పెద్దగా కష్టపడలేదు. కాస్త విభిన్నంగా ఆలోచించాడంతే.

మరణానంతరం కుటుంబసభ్యులో లేదా బంధుమిత్రులో పత్రికల్లో, టీవీల్లో ఇచ్చే సంస్మరణ ప్రకటన గురించి తెలుసు కదా. ఈ వ్యక్తి ఆ సంస్మరణ ప్రకటనను స్వయంగా రాసుకున్నాడు. ఆ కధేంటో తెలుసుకుందాం. చెన్నైకు చెందిన ఇజ్జి ఉమా మహేశ్ ( Uma Mahesh ) తన సంస్మరణ ప్రకటనను ముందుగానే రాసుకుని ( Written his own obituary )..కుటుంబసభ్యులకు అందించాడు. తన మరణానంతరం అదే ప్రకటనను పత్రికల్లో వేయడమే కాకుండా తన ఫేస్ బుక్ అక్కౌంట్ లో పోస్ట్ ( Facebook ) చేయాలని సూచించాడు. మొన్న శుక్రవారం ఉమామహేశ్ మరణించడంతో కుటుంబసభ్యులు అతను చెప్పినట్టే ఆ సంస్మరణ ప్రకటనను పత్రికల్లో ముద్రించి ఫేస్ బుక్ అక్కౌంట్ లో షేర్ చేశారు. అంతే ఇది కాస్తా వైరల్ అయిపోయిందిప్పుడు. ప్రకటనలో రాసుకున్న విధానం కూడా కాస్త విభిన్నంగా ఉంది. అంతేకాదు తన శరీర  అవయవాల్ని దానం చేయాలని కూడా అందులో రాసుకోవడం విశేషం.

స్వయం లిఖిత సంస్మరణ ప్రకటనలో ఏముంది

ఉమామహేశ్ రాసుకున్న సంస్మరణ ప్రకటన ( Obituary Advertisement ) అంశాలు కూడా మనస్సును కదిలిస్తున్నాయి. తాను నియమాలకు అనుగుణంగా సమాజంలో మతరహిత పౌరునిగా జీవించాన‌ని చెప్పుకొన్నాడు. రీసైకిల్డ్‌ టీనేజర్‌గా, రేస్‌ రన్నర్‌గా‌, హౌస్‌మేకర్‌గా, పార్టీ హోస్ట్‌గా‌, న‌టుడిగా‌, రేషనలిస్ట్‌గా‌, మానవతావాదిగా తన బాధ్యతలను తాను సక్రమంగా నిర్వర్తించానంటూ పరోక్షంగా తన జీవితకాలంలో చేసిన వివిధ రకాల వృత్తుల్ని ఉదహరించాడు. జీవితమనేది ఓ పార్టీ లాంటిదని, టైమ్‌ అనేది ఎవరికైనా అయిపోతుందని..ఉన్నంతకాలం సంతోషంగా జీవించాలని సూచించాడు. తనను తాను ఒక‌ వాహనంగా పోల్చుకున్నాడు. తన వాహనంలోని కొన్ని భాగాలు పనిచేయడం లేదని, రిపేర్‌ చేసినప్పటికీ ఫలితం లేదని చెప్పాడు. తన మరణానంతరం ఉపయోగపడే భాగాల్ని మరొకరికి దానం చేయాలని రాసుకున్నాడు. 

తను ఎలా జీవించాడు, ఏం పనులు చేశాడు, జీవితంపై తన సందేశమేంటి, తన కోరిక ఏంటనే వివరాల్ని సంక్షిప్తంగా మరణ సంస్మరణలో రాసుకోవడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటా.  అందుకే ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది. Also read: Shashi Tharoor: కరోనా కట్టడిలో మోదీ ప్రభుత్వం విఫలం

Trending News