దేశ రాజధానిలో మరోసారి కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రతి శీతాకాలానికి ముందు ఎదురయ్యే పరిస్థితే తలెత్తుతోంది. ప్రస్తుతం గాలి నాణ్యత ( Air Quality ) రోజురోజుకూ దిగజారిపోతోందని కేంద్రం హెచ్చరిస్తోంది.
దేశ రాజధాని నగరం ఢిల్లీ ( Capital city Delhi ) ఇప్పుడు మరోసారి కాలుష్యకోరల్లో చిక్కుకుంటోంది. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్డౌన్ సమయంలో కాలుష్యం దాదాపు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితిని చూశాం. ఇప్పుడు తిరిగి కాలుష్యం యధాతధస్థితికి చేరుకుపోతోంది. మరీ ముఖ్యంగా గాలి నాణ్యత పడిపోతోందని కాలుష్య నియంత్రణ మండలి ( Pollution control board ) స్పష్టం చేసింది. వాస్తవానికి ఢిల్లీ ( Delhi )లో ప్రతి యేటా శీతాకాలం ప్రారంభం కంటే ముందు కాలుష్యం ( Delhi Pollution ) సమస్య తలెత్తుతుంటుంది. ప్రతియేటా ఈ సమయంలో ఢిల్లీ చుట్టుపక్కలున్న హర్యానా ( Haryana ), పంజాబ్ ( Punjab ) ప్రాంతాల్లో రైతులు విపరీతంగా పంటవ్యర్ధాల్ని అంటే వరిపంట కొయ్యల్ని( Burning of paddy stubble ) కాల్చేస్తుంటారు. సాధారణంగా ఓ పంట పూర్తయిన తరువాత మరో పంట వేయడానికి దక్షిణాది రైతులకు , ఉత్తరాది రైతులకు తేడా ఉంటుంది. దక్షిణాది రైతులు కూలీలతో పొలం దుక్కి దున్ని కొత్త పంట వేస్తుంటారు. కానీ ఉత్తరాది రైతులు మాత్రం ఖర్చులు మిగుల్చుకునే క్రమంలో పంటవ్యర్ధాల్ని కాల్చివేస్తుంటారు. వేలాది ఎకరాల్లో ఇలా చేయడం వల్ల ఆ కాలుష్యమంతా పొరుగున ఉన్న ఢిల్లీ నగరంపై వచ్చి పడుతుంటుంది. ఈ కారణంగా పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గాలిలో నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంటుంది.
ప్రస్తుతం ఢిల్లీలో గాలిలో నాణ్యత ( Air Quality index ) తగ్గిపోతోందని కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించింది. మరి కొన్నిరోజుల్లో ప్రారంభమయ్యే వరికొయ్యల దహనంతో కాలుష్యం మరింతగా పెరిగే అవకాశముందని తెలిపింది. ఢిల్లీలో ఆదివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు గాలిలో నాణ్యత 275 ఏక్యూఐగా నమోదైంది. 24 గంటల సగటు ఏక్యూఐ శనివారం 287గా ఉంది. శుక్రవారం 239 ఉండగా..గురువారం 315 ఉంది.
ఇక గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే శుద్ధమైందిగా, 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా ఉందని చెబుతారు. అదే 201-300 మధ్య ఉంటే పేలవంగా ఉందని..301-400 మధ్యన ఉంటే అతి పేలవమని అంటారు. 401-500 మద్య ఉంటే మాత్రం తీవ్రమైన కాలుష్యంగా పిలుస్తారు. ఢిల్లీలో పగటిపూట వాయువ్య దిశలో గాలులు వీస్తుండటం వల్లన...చుట్టుపక్కల రాష్ట్రాల్లో కాల్చే పంట వ్యర్ధాల కాలుష్యం ఢిల్లీపై పడుతుంటుంది. అటు రాత్రి సమయంలో గాలులు, తక్కువ ఉష్ణోగ్రత కారణంగా కాలుష్యం కారకాలు వచ్చి చేరుతున్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. Also read: Self Obituary: మరణానికి ముందే స్వయం లిఖిత సంస్మరణ ప్రకటన
ప్రస్తుతం పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ఏక్యూఐ 882గా ఉందని ఎర్త్ సైన్సెస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంస్థ తెలిపింది. గాలిలోని నాణ్యతపై గడ్డి దహనం ప్రబావం గణనీయంగానే ఉందని ఈ సంస్థ వెల్లడించింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం గడ్డి దహనం తక్కువగానే ఉంటుందని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. దీనికి కారణం ఈ యేడాది బాస్మతి యేతర వరి సాగు తక్కువగా ఉండటమే. నాన్ బాస్మతిలో సిలికా ఎక్కువగా ఉండటం వల్ల పశుగ్రాసంగా కూడా పనికి రాదు. దాంతో రైతులు కాల్చేస్తుంటారు.
వరి గడ్డి దహనానికి తోడు ఢిల్లీలో వాహన, పరిశ్రమల కాలుష్యం కూడా మళ్లీ క్రమంగా పెరుగుతోంది. వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈవెన్ - ఆడ్ ( Odd Even number formula ) నెంబర్ ఫార్ములా ప్రవేశపెట్టినా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. అందుకే ఈసారి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రాంతాల్లో స్మాగ్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టవర్లు ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి మరి. Also read: Kangana Ranaut: పప్పూసేన నన్ను మిస్ అవుతోంది..
Delhi: అక్టోబర్ నెలలో కాలుష్యం ఎందుకు పెరుగుతుంటుంది?