కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన ఓ క్వారంటైన్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుతో ఓ ఆరేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటుచేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో సోమవారం (మే 25న) ఈ ఘటన జరిగింది.    ఎగసిన కెరటం నటి ఐశ్వర్య రాజేష్.. కంటతడి పెట్టించే విషాదాలెన్నో..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వస్థలాలకు వస్తున్న వలస కూలీలతో పాటు వ్యక్తులను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ కేంద్రంలో ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఆరేళ్ల బాలిక సహా ఓ కుటుంబాన్ని నైనిటాల్ జిల్లాలోని తల్లిసేథి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆరేళ్ల బాలిక నోటి నుంచి నురగలు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు బెతల్ ఘాట్ కమ్యూనిటి హెల్త్ సెంటర్‌కు తీసుకొచ్చారు.  బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి


బాలిక శరీరంపై గాట్లు గుర్తించిన వైద్య సిబ్బంది విష సర్పం కాటేసిందని భావించి ఆ చిన్నారికి విషపు విరుగుడు ఇంజెక్షన్లు చేశారు. కానీ కొంత సమయానికే బాలిక చనిపోవడంతో కుటుంబం విషాదంలో మునిగింది. ఈ ఘటనపై నైనిటాల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందగా.. విచారణకు ఆదేశించారు. బాలిక కుటుంబానికి రూ.3 లక్షల మేర పరిహారం చెల్లించనున్నట్లు ఓ అధికారి ప్రకటించారు. క్వారంటైన్ సెంటర్లలో వసతుల లేమిపై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..


వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్


  ఖతర్నాక్ ఫొటోలు వదిలిన కేథరిన్