Chhattisgarh Accident: పండుగ రోజు విషాధం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో 15 మంది ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో కుమ్హారి ప్రాంతంలో డిస్టిలరీ అనే ప్రైవేటు కంపెనీ తమ ఉద్యోగులను ట్రాన్స్‌పోర్టు ద్వారా ఇళ్లకు తరలిస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్‌ జరిగింది. రాత్రి 8:30 గంటల సమయంలో అక్కడ మొరం మట్టి కోసం తవ్విన గుంత దాదాపు 40 అడుగులో లోతులో బస్సు ప్రమాదవశాత్తు పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని హుఠాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ బస్సులో దాదాపు 30 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో నలుగురు ఉద్యోగులు ప్రమాదం జరిగిన వెంటనే చనిపోయారు. మరో 11 మంది ఉద్యోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన ఉద్యోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


ఇదీ చదవండి:తెలంగాణకు చల్లని కబురు చెప్పిన వాతావరణ కేంద్రం.. మరో ఐదు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు..


 



ఈ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మోదీ చెప్పారు. ఇక గాయపడిన క్షతగాత్రులను రాయ్ పూర్ ఏయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం ఎలా జరిగి ఉంటుందని ఇప్పటికే స్థానిక పోలీసు యంత్రాంగం విచారణ మొదలుపెట్టింది. విషయం తెలుసుకున్న చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ విచారణ వ్యక్తం చేశారు. ఇక ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఏయిమ్స్‌ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు.


ఇదీ చదవండి:ఎల్పీజీ గ్యాస్‌ వినియోగదారులకు అలెర్ట్.. ఇ-కేవైసీ చేయించకపోతే ఏం జరుగుతుందో తెలుసా?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook