LPG e-KYC Update: ఎల్పీజీ గ్యాస్‌ వినియోగదారులకు అలెర్ట్.. ఇ-కేవైసీ చేయించకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

LPG e-KYC Update: మొదటి దశలో ఉజ్వల యోజన వినియోగదారులకు ఇకేవైసీ చేయించుకున్నారు. ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు ఇకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, ఒకవేళ ఈ కేవైసీ చేయించకపోతే సబ్సిడీ రాదు,

Written by - Renuka Godugu | Last Updated : Apr 10, 2024, 07:59 AM IST
LPG e-KYC Update: ఎల్పీజీ గ్యాస్‌ వినియోగదారులకు అలెర్ట్.. ఇ-కేవైసీ చేయించకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

LPG e-KYC Update: మొదటి దశలో ఉజ్వల యోజన వినియోగదారులకు ఇకేవైసీ చేయించుకున్నారు. ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు ఇకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, ఒకవేళ ఈ కేవైసీ చేయించకపోతే సబ్సిడీ రాదు, కనెక్షన్‌ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందట. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఎల్పీజీ వినియోగదారులకు ఈ ఇకేవైసీ ప్రక్రియ జరుగుతోంది.

గ్యాస్‌ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడు తమ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి ఇకేవైసీని సత్వరమే పూర్తి చేసుకోవాలి.ఇప్పటికే తమ వినియోగదారులు కేవైసీ చేయించుకోవడానికి అన్ని డైరెక్షన్స్ ఇచ్చాయి సదరు పెట్రోలియం కంపెనీలు. ఈ నేపథ్యంలోనే మొదటి దశలో ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్‌ కనెక్షన్‌ పొందిన వినియోగదారులు ఇకేవైసీని పూర్తి చేశారు. ప్రస్తుతం సాధారణ గ్యాస్ వినియోగదారులు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోతే సబ్సడీ ఆగిపోవడమే కాదు కనెక్షన్ కూడా కట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఓటర్ కార్డులో అడ్రస్ తప్పుందా..? సింపుల్‌గా ఇలా మార్చుకోండి

ఉజ్వల పథకం ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వినియోగదారులకు కేంద్ర సూచన మేరకు వారి ఖాతాలో సబ్సిడీ డబ్బులను జమా చేస్తున్నారు. వీరికి కేవైసీ ప్రక్రియను మొదటలోనే చేశారు. ఈ కేవైసీ ప్రక్రియను గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మొదట్లో చాలా పెద్ద సంఖ్యలో గ్యాస్ ఏజేన్సీ కేంద్రాల వద్ద బారులు తీరి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన వినియోగదారులను మనం చూశాం.

ఇదీ చదవండి: దేశంలోని అన్ని సమస్యలకు 'కాంగ్రెస్‌ పార్టీ తల్లి': మోదీ విమర్శలు

ఇక డొమెస్టిక్ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ అభిజిత్ కశ్యప్ ప్రకారం ఇకేవైసీ ప్రక్రియ సాధారణ వినియోగదారులకు కూడా త్వరలోనే ముగుస్తుందని తెలిపారు. పెట్రోలియం కంపెనీల సూచనలతో వినియోగదారులకు సులభంగా ఇకేవైసీ తమ గ్యాస్ కంపెనీ ఏజెన్సీల ద్వారానే పూర్తి చేస్తున్నామన్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News