Radhika Merchant: పుట్టినరోజు వేడుకల్లో రాధిక మర్చంట్ కు ఘోర అవమానం.. ఏం జరిగిందంటే....?
Radhika Merchant Birthday Bash: పెళ్లయిన తర్వాత తన మొదటి పుట్టినరోజుని.. ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేది రాధిక మర్చంట్. అంబానీ ఎంత ఈ సెలబ్రేషన్స్ కి ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. అయితే ఈ పుట్టినరోజు సంబరాలలో.. రాధికకి ఘోర అవమానం.. జరిగింది అదేమిటో ఒకసారి చూద్దాం..
Akash Ambani refused cake from Radhika Merchant: ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో పేరు సొంతం చేసుకున్న అంబానీ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ కుటుంబం గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల ముకేష్ అంబానీ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ కి వివాహం జరిపించిన విషయం తెలిసిందే. రాధిక మర్చంట్ ను తన కొడుకుకిచ్చి వివాహం జరిపించి సాగరంగా ఆమెను ఇంటికి కొత్త కోడలిగా ఆహ్వానించారు.
అంబానీ ఇంట కోడలిగా అడుగుపెట్టిన రాధిక మర్చంట్ తాజాగా అత్తవారింట్లో తన తొలి పుట్టిన రోజు వేడుకను జరుపుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆమెకు తన బావ ఆకాష్ అంబానీ నుండి అవమానం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తాజాగా బుధవారం రాత్రి అంబానీ కుటుంబంలో రాధిక 30 వ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ముఖ్యంగా ఈ పార్టీలో అంబానీ కుటుంబంతోపాటు వ్యాపార కుటుంబాలు అలాగే అతిథి జాబితాలో జాన్వీ కపూర్ , ఎమ్మెస్ ధోని, అనన్య పాండే, ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ , రణవీర్ సింగ్ , ఓర్రీ తదితరులు హాజరయ్యారు.
ఈ క్రమంలోనే ఆమె కేక్ కట్ చేసిన తర్వాత మొదట ఆమె భర్త అనంత్ అంబానీ కి కేకు ముక్కను అందించింది. ఆ తర్వాత రాధిక కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా కేకు అందించడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఒక ముక్క తినగా.. రాధిక తల్లిదండ్రులు శైలా, వీరేన్ మర్చంట్ కూడా కేక్ తీసుకున్నారు ఆ తర్వాత ఆమె అనంత అంబానీ సోదరుడు ఆకాష్ అంబానీకి కేక్ అందించగా అతడు కేక్ నిరాకరించాడు. అయితే ఈ విషయాన్ని ఓర్రీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఆకాష్ తొలుత తన కుటుంబ మాతృక అయిన.. కోకిల బెన్ అంబానీ కి కేకు తినిపించమని రాధికాకు సూచించారు. ఆ తర్వాత ఆకాష్ తన అమ్మమ్మ పూర్ణిమ దళాల్ ని.. కూడా ముందుకు తీసుకొచ్చి పుట్టినరోజు కేకు తినమని అభ్యర్థించాడు.ఇది చూసిన తర్వాత ఆకాశ అంబానీ పెద్దలపట్ల గౌరవం చూసి ..అతని మంచితనానికి కామెంట్లు చేస్తున్నారు.
Also Read: OTT Releases: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్, రేపు 15 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook