All schools in Delhi to remain closed till October 31: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి విజృంభిస్తునే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్‌లాక్ 5.0 లో భాగంలో అక్టోబరు 15 నుంచి పాఠశాలలు, కళాశాలలలను తిరిగి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు పాఠ‌శాల‌లన్నీ(Delhi Schools)  మూసే ఉంటాయని ప్ర‌భుత్వం స్పష్టంచేసింది. ఈ మేర‌కు ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మ‌నీశ్ సిసోడియా (Manish Sisodia) ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే పాఠశాలల మూసివేతపై ప్రభుత్వం వివరంగా ఉత్తర్వులను వెలువరిస్తుందని ఆయన సిసోడియా వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం, శుక్రవారం, శనివారం వరుసగా 3,037, 2,920, 2,258 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,930 చేరగా.. ఈ మహమ్మరి కారణంగా 5,472 మంది మరణించారు. Also read: Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్


ఇదిలాఉంటే.. క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా మార్చిలో విధించిన లాక్డౌన్ నాటినుంచి అన్ని కార్యకలాపాలతోపాటు విద్యాసంస్థ‌లు కూడా మూత‌ప‌డ్డాయి. ఈ క్రమంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హణ సాధ్యం కాక‌పోవ‌డంతో విద్యార్థుల‌ను పై త‌ర‌గ‌తుల‌కు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జూన్‌లోనే నూత‌న విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కావాల్సి ఉన్నప్ప‌టికీ ప‌రిస్థితి మెరుగుప‌డ‌క పోవ‌డంతో పాఠ‌శాల‌లు, కళాశాల‌లు తెరుచుకోలేదు. ఈ క్రమంలో కేంద్రం అన్‌లాక్ 5.0లో భాగంగా విద్యాసంస్థలు పునఃప్రారంభించేందుకు అనుమతిచ్చినప్పటికీ.. రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. Also read: Harthras Case: హత్రాస్‌ కేసును సీబీఐకి అప్పగించిన సీఎం యోగి