అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ( International human rights organisation ) ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ( Amnesty international ) సంచలన ప్రకటన చేసింది. ఇండియాలో కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది ఆమ్నెస్టీ సంస్థ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ. ప్రపంచవ్యాప్తంగా శాఖల్ని కలిగి ఉండి..మానవ హక్కుల సంరక్షణపై పోరాటం చేస్తుంటుంది. ఇప్పుడీ సంస్థ చేసిన ప్రకటన సంచలనమవుతోంది. ఇండియాలో తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆరోపణలు చేసింది. తమ సంస్థ బ్యాంకు ఖాతాల్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Directorate ) అప్రజాస్వామికంగా సెప్టెంబర్ 10 న సీజ్ చేసిందని తెలిపింది. తీవ్ర వేదన, దుఖంతోనే ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని సంస్థ చెప్పింది. ప్రభుత్వ ప్రతీకార చర్యలే తమ నిర్ణయానికి కారమమని..ఉద్దేశ్యపూర్వకంగానే భారత ప్రభుత్వం మానవ హక్కుల సంస్థల్ని వెంటాడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.



దేశంలో మానవ హక్కులు ఉల్లంఘనలపై తాము సమర్పించిన నివేదికల నేపథ్యంలో తమ సభ్యులు, బెదిరింపులు, వేధింపుల దాడిని ఎదుర్కొంటున్నారని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా చెప్పారు. మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వడం కేంద్ర ప్రభుత్వానికి ( Central Government ) ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, జమ్ముకశ్మీర్ అంశాలపై మౌనం వహించిదని ఆరోపించారు. ఇలాంటి ధోరణుల మధ్య దేశంలో ఇక  సేవలు అందించలేమని తెలిపింది. 70కి పైగా దేశాలలో పనిచేస్తున్నామని..గతంలో అంటే 2016 లో రష్యాలో మాత్రమే కార్యకలాపాలను మూసివేశాని ఖోస్లా చెప్పారు. 


అసలేం జరిగింది..


ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -2010 ( Foreign contribution regulation act ) ( ఎఫ్‌సీఆర్ఏ ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై 2019 నవంబర్ 5న  సీబీఐ ( CBI ) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. సంస్థ ప్రధాన కార్యాలయంపై  దాడులు నిర్వహించింది. అలాగే గత ఏడాది ఈడీ ( ED )ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలతో తాజాగా ఇండియాలో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది.


నిబంధనల ప్రకారం ఈడీ వ్యవహరిస్తే...ఆమ్నెస్టీ సంస్థ మాత్రం ఆరోపణలు చేస్తుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఆమ్నెస్టీ తాజా నిర్ణయం  మాత్రం సంచలనం రేపుతోంది. Also read: Building Collapse: గుజరాత్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు దుర్మరణం