బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టం (CAA) వ్యతిరేఖ ర్యాలీలో అమూల్య లియోని అనే యువతి 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అమె చేసిన పాకిస్థాన్‌ అనుకూల నినాదాల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే తాను కేవలం ఒక ముఖాన్ని మాత్రమేనని, తన వెనుక ఓ పెద్ద గ్రూపు ఉందని సంచలన కామెంట్లు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: టాలీవుడ్ దర్శకుడి ఇంట విషాదం..


Also Read: అసదుద్దీన్ ఒవైసీ ర్యాలీలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు!


‘అప్పటికప్పుడు కేవలం నేను చేసిన పని కాదు. మీడియా నన్ను మాత్రమే హైలైట్ చేసి చూపించింది. కానీ నా వెనుక ఓ పెద్ద గ్రూపు ఉంది. నేను ఏం మాట్లాడాలో నా తల్లిదండ్రులు, కొన్ని సలహా కమిటీలు నాకు సూచిస్తాయి. స్టూడెండ్ యూనియన్లు నాకు మద్దుతుగా ఉన్నాయి. బెంగళూరు విద్యార్థి సంఘాలతో తనకు అనుబంధం ఉందని’ అమూల్య లియోని కామెంట్లు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది.


Also Read: ఆ యువతిని తల్లిదండ్రులే కడతేర్చారు.. కారణం తెలిస్తే షాక్!


కాగా, బెంగళూరుకు సభకు కొన్ని రోజుల ముందు అమూల్య ఫేస్ బుక్‌లో చేసిన పోస్టులు హాట్ టాపిక్ అవుతున్నాయి. ‘లాంగ్ లైవ్ ఇండియా, లాంగ్ లైవ్ పాకిస్తాన్, లాంగ్ లైవ్ బంగ్లాదేశ్, లాంగ్ లైవ్ శ్రీలంక, లాంగ్ లైవ్ నేపాల్. లాంగ్ లైవ్ అఫ్గానిస్థాన్. లాంగ్ లైవ్ చైనా. లాంగ్ లైవ్ భూటాన్’ అని ఓ కామెంట్ చేసినట్లు గుర్తించారు. కేవలం చట్టాల ప్రకారం తాను భారతీయ పౌరురాలినని, అయితే పాకిస్థాన్ జిందాబాద్, హిందూస్థాన్ జిందాబాద్ నినాదాలకు పెద్ద వ్యత్యాసమేమీ లేదని అమూల్య తన అభిప్రాయాలు షేర్ చేసుకుంది.


Also Read: గన్ మిస్‌ఫైర్: కానిస్టేబుల్‌ తలలోకి దూసుకెళ్లిన తూటా


కాగా, బెంగళూరులో జరిగిన ర్యాలీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం తర్వాత మైక్ అందుకున్న అమూల్య పాకిస్థాన్ జిందాబాద్ చయడం, ఆ వెంటనే ఒవైసీ, స్టేజీ మీద ఉన్న కొందరు ఆమెను అడ్డుకున్నారు. దాంతో హిందూస్థాన్ జిందాబాద్ అని గట్టిగా నినాదాలు చేసిన అమూల్య మళ్లీ పాక్ అనుకూల నినాదాలు చేయడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రాజద్రోహం సెక్షన్ల కింద నమోదు చేశారు. ప్రస్తుతం అమూల్య 14రోజుల కస్టడీలో ఉంది.


See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా


మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి  


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..