Punjab AAP CM Candidate: ఆ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేసిన కేజ్రీవాల్...
Punjab AAP CM Candidate: దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కోసం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. `జనతా చునేగీ అప్నా సీఎం (ప్రజలే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తారు) క్యాంపెయిన్ పేరిట ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తున్న ఈ టెలీ ఓటింగ్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
Punjab AAP CM Candidate: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని పంజాబ్ ప్రజలకే వదిలేశారు. ఇందుకోసం టెలీ ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో పాల్గొనాలకునే ఓటర్లు '7074870748' నంబర్‌కు ఫోన్ చేసి.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమకు నచ్చిన నేత పేరును సూచించవచ్చు. లేదా ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా కూడా తమ ప్రతిపాదనను తెలియజేయవచ్చు. మెజారిటీ ఓటర్ల ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని జనవరి 17న ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారు.
దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కోసం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. 'జనతా చునేగీ అప్నా సీఎం (ప్రజలే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తారు) క్యాంపెయిన్ పేరిట ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తున్న ఈ టెలీ ఓటింగ్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. జనవరి 17 సాయంత్రం 5గం. వరకు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ప్రజలు తమ అభిప్రాయాన్ని పార్టీకి ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు.
నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ చీఫ్, ఎంపీ భగవంత్ మన్‌ను (Bhagwant Mann) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని అంతా భావించారు. కేజ్రీవాల్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు కూడా కావడం కలిసొస్తుందనుకున్నారు. కానీ కేజ్రీవాల్ మాత్రం ఇందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటించేందుకు భగవంత్ మన్ నిరాకరించారని కేజ్రీవాల్ పేర్కొనడం గమనార్హం. 'ముఖ్యమంత్రి అభ్యర్థి విషయమై నేను భగవంత్ మన్‌ను అడిగాను. నీ పేరును ప్రకటించాలా అని అడిగితే అందుకు నిరాకరించాడు. దానికి బదులు ప్రజలనే ఆ నిర్ణయం కోరాలని అన్నాడు.' అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
కాగా, 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress Party) తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్నది ఆమ్ ఆద్మీ పార్టీనే. అప్పటి ఎన్నికల్లో ఆ పార్టీకి 20 సీట్లు లభించాయి. పంజాబ్ లోకల్ పార్టీ శిరోమణి అకాలీదళ్, బీజేపీలకు కేవలం 15, 3 సీట్లు మాత్రమే దక్కాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ భావిస్తోంది. పంజాబ్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: Anasuya Bharadwaj: లంగాఓణీలో మెరిసిన అనసూయ.. నడుము వొంపులు మాములుగా లేవుగా!!
Also Read : పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' కథ లీక్.. అసలు పాయింట్ చెప్పేసిన హీరోయిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook