Asaduddin Owaisi slams Amit Shah: 2002 నాటి హింసకు కారణమైన వారికి బీజేపి సరైన గుణపాఠం నేర్పిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఒవైసి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఎవ్వరూ ఎల్లకాలం అధికారంలో ఉండరు అని వ్యాఖ్యానించిన అసదుద్దీన్ ఒవైసి.. అమిత్ షా అధికారం మత్తులో తూలుతున్నారని మండిపడ్డారు. బిల్కిస్ బనో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను జైలు నుంచి వదిలేయడమే బీజేపి నేర్పిన గుణపాఠమా అని అసదుద్దీన్ ఒవైసి ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకంటే ముందు శుక్రవారం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. 2002 లో బీజేపి గుణపాఠం నేర్పిన తరువాతే రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడిన సంఘ విద్రోహ శక్తులు అరాచకానికి పాల్పడటం ఆపేశారని అన్నారు. సంఘ విద్రోహ శక్తులకు బీజేపి గుణపాఠం నేర్పి రాష్ట్రంలో శాంతి నెలకొల్పేలా చేసిందని పేర్కొన్నారు. 2002 ఫిబ్రవరిలో గోద్రా రైల్వే స్టేషన్ లో రైలును తగలబెట్టిన దుర్ఘటన తరువాత గుజరాత్ రాష్ట్రం నలుమూలలా అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత బీజేపి సర్కారు తీసుకున్న చర్యల కారణంగా అల్లర్లకు పాల్పడిన వారికి గుఠపాఠం వచ్చిందనే కోణంలో అమిత్ షా వ్యాఖ్యలు చేశారు.


అయితే, అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ అసదుద్దీన్ ఒవైసి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అల్లర్ల సమయంలోనే గ్యాంగ్ రేప్ కి గురైన బిల్కిస్ బనో కేసులో నిందితులను వదిలేయడమే బీజేపి నేర్పిన గుణపాఠం అనుకోవాలా అని అమిత్ షాను నిలదీశారు. బిల్కిస్ బనో కళ్ల ముందే మూడేళ్ల వయస్సున్న ఆమె కన్నబిడ్డను హత్య చేసిన నిందితులను వదిలేయాలనుకోవడమే బీజేపి నేర్పిన గుణపాఠం అని ప్రశ్నించారు.


గుజరాత్ అల్లర్లలోనే కొంతమంది ముస్లింలు చనిపోయారని.. అందులో కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రి కూడా ఉన్నారని అన్నారు. గుల్బర్గ సొసైటీ, బెస్ట్ బేకరీ ఉదంతాలను గుర్తు చేస్తూ అవేనా బీజేపి నేర్పిన గుణపాఠాలు అని అమిత్ షాకు వరుస ప్రశ్నలు సంధించారు. అహ్మెదాబాద్ లోని ముస్లిం ఆధిపత్యం ఉన్న జుహాపుర ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ అసదుద్దీన్ ఒవైసి ( Asaduddin Owaisi ) ఈ వ్యాఖ్యలు చేశారు.


Also Read : Viral Video : పాపం.. బాలుడి ముఖం నిండా వెంట్రుకలు.. చూసి భయపడుతున్న జనం !!


Also Read : Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసికి ముస్లిం యువత చేతిలో గుజరాత్‌లో చేదు అనుభవం


Also Read : Gujarat Election: 20 లక్షల ఉద్యోగాలు.. బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీలు.. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ హామీల వర్షం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook