Viral Video : పాపం.. బాలుడి ముఖం నిండా వెంట్రుకలు.. చూసి భయపడుతున్న జనం !!

Teenage Boy With Werewolf Syndrome: తనకు ఉన్న అరుదైన ఆరోగ్య సమస్య గురించి, తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న వేధన గురించి వివరించాడు. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా జనం తనను అదే పనిగా చూసేవారని, బడిలో తోటి పిల్లలు తనను అందరిలా కాకుండా కొంచెం భిన్నంగా, విచిత్రంగా చూసేవారని గుర్తుచేసుకున్నాడు.

Last Updated : Nov 26, 2022, 09:13 PM IST
  • తెలిసి తెలియని పసి ప్రాయంలోనే వింత సమస్య
  • ఎగతాళి చేసే వాళ్లు కొంతమంది.. భయపడిన వాళ్లు కొంతమంది
  • హనుమంతుడి అవతారంగా భావించిన వాళ్లు ఇంకొంతమంది
  • ఇంతకీ ఈ రుగ్మతకు పేరేంటి ? పరిష్కారం లేదా ?
Viral Video : పాపం.. బాలుడి ముఖం నిండా వెంట్రుకలు.. చూసి భయపడుతున్న జనం !!

Teenage Boy With Werewolf Syndrome: భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన లలిత్ పాటిదార్ అనే 17 ఏళ్ల బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతూ వార్తల్లోకెక్కాడు. బాలుడి ముఖం, శరీరం అంతటా వెంట్రుకలు పెరగడమే ఆ అరుదైన వ్యాధి లక్షణం. ఈ అరుదైన, వింత ఆరోగ్య పరిస్థితిని హైపర్‌ట్రైకోసిస్ అంటారు. దీనినే వెర్‌వోల్ఫ్ సిండ్రోమ్ అనే పేరుతోనూ పిలుస్తారు. బాలుడికి 6 సంవత్సరాల వయస్సులో హైపర్‌ట్రికోసిస్ నిర్ధారణ అయింది. ఆరంభంలో శరీరంలో మార్పులు చోటుచేసుకోవడం చూసి అందరూ భయపడ్డారు. తోటి పిల్లలు కొంతమంది భయపడి దూరం పరిగెడితే.. ఇంకొంతమంది అతడి ఆరోగ్య పరిస్థితిని చూసి ఎగతాళి చేసే వారు. బాలుడు అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం అందరికీ తెలియక అతడిని అదోరకంగా చూసేవారు.

తెలిసి తెలియని పసి ప్రాయంలోనే చుట్టూ ఉన్న వారి ప్రవర్తన ఆ బాలుడిని విపరీతంగా బాధపెట్టేదట. కానీ చిన్నతనంలోనే ఆ బాధలను దిగమింగుకుని బతకడం నేర్చుకున్నాడు. ఎగతాళి చేసే వారి మధ్యలో, భయంగా చూసేవారి మధ్యలోంచే ముందుకు సాగిపోవడం అలవాటు చేసుకున్నాడు.  

లలిత్ పాటిదార్ తాజాగా జీ మీడియాతో మాట్లాడుతూ, తనకు ఉన్న అరుదైన ఆరోగ్య సమస్య గురించి, తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న వేధన గురించి వివరించాడు. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా జనం తనను అదే పనిగా చూసేవారని, బడిలో తోటి పిల్లలు తనను అందరిలా కాకుండా కొంచెం భిన్నంగా, విచిత్రంగా చూసేవారని గుర్తుచేసుకున్నాడు. తనను చూసి భయపెట్టే వాళ్లు కొంతమంది అయితే, తనని భయపెట్టే వాళ్లు ఇంకొంతమంది.. ఇలా అన్ని సమస్యలు దాటుకుని వస్తున్న విషయాన్ని లలిత్ పాటిదార్ చెప్పడం చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపించకమానదు. ఇంకొంతమంది జనం తనను హనుమంతుడి అవతారంగా భావించే వాళ్లు కూడా లేకపోలేదని చెప్పుకొచ్చాడు.

అయితే, ఎప్పుడైతే తన పరిస్థితి గురించి ఊర్లో వారికి అర్థం అయిందో.. అప్పటి నుంచి వారు తనను చూసే విధానంలో, తనతో ప్రవర్తించే విధానంలో కొంత మార్పు వచ్చిందని లలిత్ పాటిల్ తెలిపాడు. 21 ఏళ్ల వయస్సుకు వస్తేనే తనకు అవసరమైన చికిత్స, సర్జరీ సాధ్యపడుతుందని వైద్యులు చెప్పారని లలిత్ పేర్కొన్నాడు. అప్పటి వరకు లలిత్ పాటిల్ ది ఇలా ఇబ్బంది పడక తప్పని పరిస్థితి. 

ఇంతకీ హైపర్‌ట్రైకోసిస్ అంటే ఏంటి ?
అమెరికాలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, హైపర్‌ట్రికోసిస్ అంటే శరీరంపై ఎక్కడైనా అధిక జుట్టు పెరిగే శారీరక రుగ్మత. ఇది మగవారిలోనైనా లేదా ఆడవారిలోనైనా ఈ సిండ్రోమ్ కనిపించవచ్చు.  కొంతమందిలో పుట్టుకతోనే ఈ సమస్య ఎదురైతే.. ఇంకొంతమందిలో వయస్సు పెరిగే దశో మధ్యలో ఎప్పుడైనా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Viral Video: ఇదేం మాస్ రా మావా.. మేక తాటి చెట్టు ఎక్కడం ఏంది..? ఎలా ఎక్కిందో మీరే చూడండి..

Also Read : Cobra Mongoose Viral Video: బ్లాక్ కోబ్రా, ముంగిస మధ్య భీకర ఫైట్.. చివరకు ఏది గెలిచిందో తెలుసా?

Also Read :  Snake Chappal Viral Video: చెప్పులను దొంగతనం చేస్తున్న పాము.. వీడియో చూస్తే పడీపడీ నవ్వుకుంటారు! గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇస్తుందేమో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News