Assembly Election Result 2022: మొదలైన ఓట్ల లెక్కింపు.. యూపీపైనే అందరి చూపు! ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమయ్యేనా?
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 8 గంటలకు 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రస్తుతం గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపెవరిదనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది.
Counting of votes for five states under way:
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 8 గంటలకు 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రస్తుతం గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపెవరిదనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 403 స్థానాలకు 7 విడతల్లో పోలింగ్ జరిగింది. దీంతో యూపీలోని మొత్తం 75 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. యూపీలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇది సుమారు 30 నుండి 40 నిమిషాలు పడుతుంది. దాంతో త్వరలో మొదటి ట్రెండ్ బయటకు వస్తుంది. అయితే యూపీలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ సైతం గెలుపుపై ధీమాగా ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజం అవుతుందో లేదో చూడాలి.
యూపీలో 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజార్టీ 202. దాంతో అందరి దృష్టి యూపీపైనే ఉంది. బీజేపీ మళ్లీ అధికారికంలోకి వస్తుందని అందరూ ధీమాగా ఉన్నారు. అందుకు తగ్గట్టే తొలి ట్రెండ్‌లో ఇప్పుడు బీజేపీ 112 స్థానాల్లో, సమాజ్‌వాదీ పార్టీ 81 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అదే సమయంలో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ 5 స్థానాల్లో, కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
'ఈవీఎం టాంపరింగ్ అన్న ప్రశ్నే లేదు. 2004 నుంచి ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం. 2019 వీవీప్యాట్‌లను ప్రతి పోలింగ్ బూతులోకి అందుబాటులోకి తీసుకొచ్చాము. పోలింగ్ అనంతరం ప్రతి ఈవీఎంకు సీల్ వేస్తాం. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా సాగుతుంది. ప్రణాళిక బద్దంగా కౌంటింగ్ నిర్వహిస్తాం. రాజకీయ పార్టీల అధీకృత పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలోకి రావడానికి అనుమతి ఇస్తున్నాం' అని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర అన్నారు.
Also Read: Magic Figure: మేజిక్ ఫిగర్ అంటే ఏంటి, ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మేజిక్ ఫిగర్ ఎంత
Also Read: Horoscope Today March 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ధననష్టం తప్పదు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook