మనాలీ: మూడు రోజుల క్రితమే అనేక హంగులతో ప్రారంభోత్సవం జరుపుకున్న అటల్ టన్నెల్లో ( Atal Tunnel ) అప్పుడే మూడు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన ఈ సొరంగ మార్గాన్ని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ PM Narendra Modi ) ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్తగా ప్రారంభమైన ఈ సొరంగ మార్గంలో అక్టోబర్ 4న మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంగా పేరొందిన అటల్ టన్నెల్‌లో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు కొంత మంది పోటీ పడుతుండగా.. ఇంకొంత మంది నిర్లక్ష్యంగా, వేగంగా డ్రైవ్ చేస్తూ కనిపిస్తున్నారు. అటల్ టన్నెల్ సీసీటీవీ ఫుటేజీ ( CCTV Cameras in Atal tunnel ) పరిశీలించినప్పుడు కొంతమంది వాహనదారులు మార్గం మధ్యలో ఆగి సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయని.. అలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగానే అటల్ సొరంగ మార్గంలో ఒకే రోజు మూడు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. Also read : PM Modi inaugurates Atal tunnel: ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం 'అటల్ టన్నెల్' ప్రారంభించిన ప్రధాని మోదీ


భారీ సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోన్న సొరంగ మార్గం వద్ద వాహనదారులను నిలువరించడానికి వీలుగా సరైన సెక్యురిటీ లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని గుర్తించిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, కులు జిల్లా అధికార యంత్రాంగం.. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా కోరుతూ హిమాచల్ ప్రదేశ్ సర్కారుకి లేఖ రాశాయి. సొరంగ మార్గం వద్ద పోలీసు, డిఫెన్స్ సెక్యురిటీ ఉండే వాహనదారుల స్పీడుకు కళ్లెం వేయవచ్చని అధికారయంత్రాంగం భావిస్తోంది. Also read : Dubbaka bypoll updates: దుబ్బాక ఉపఎన్నికకు ముందు టీఆర్ఎస్‌కి గట్టి షాక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe