Benefits Of Credit Card: క్రెడిట్ కార్డు అంటే చాలా మంది భయపడిపోతుంటారు. క్రెడిట్ కార్డు తీసుకుంటే జీవితం నరకంగా మారుతుంది అని చాలా మంది అపోహపడతారు. అయితే క్రెడిట్ కార్డును సరిగ్గా వినియోగిస్తే ( Proper Usage Of Credit Card ) ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అయితే క్రెడిట్ కార్డు వినియోగానికి ముందు ఆర్థిక క్రమశిక్షణ ( Financial Discipline ) అవసరం. ఒక లిమిట్ అని పెట్టుకుని వినియోగించాలి అని తెలుసుకొవడం చాలా ముఖ్యం. ఇలా మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ( Financial Planning ) ఉంటే మాత్రం క్రెడిట్ కార్డు వల్ల ఎన్నో విధాలుగా లాభాలు పొందవచ్చు. అందులో కొన్ని లాభాలు మీకోసం. (Also Read : Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


షాపింగ్ ( Shopping Experince )
చేతిలో డబ్బులు లేనప్పుడు  కూడా నిత్యవసరాల నుంచి లగ్జరీ ఐటమ్స్ ( Luxery Items ) కొనేందుకు క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి. చాలా మంది క్రెడిట్ కార్డులను షాపింగ్ కోసమే వినియోగిస్తుంటారు. డబ్బు అరేంజ్ అయ్యాక బిల్లు చెల్లిస్తుంటారు. అంటే డబ్బు లేని సమయంలో అవసరమైన వస్తువులను కొనేందుకు ఇక ఆగాల్సిన అవసరం ఉండదు. ఈఎమ్ఐపై ( EMI ) చెల్లించే సదుపాయాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. జీతం వచ్చాక లేదా చేతికి డబ్బులు అందాక తిరిగి చెల్లించవచ్చు.


డబ్బుకు ప్రత్యామ్నాయం ( Alternative to Cash )
క్రెడిట్ కార్డు వల్ల జేబులో డబ్బు పెట్టుకుని తిరిగే అవసరం తగ్గుతుంది. నిజానికి క్రెడిట్ కార్డు ఉంటే ఏ సర్వీసుకు అయినా, వస్తువు కొన్నా డబ్బు చెల్లించే అవసరం లేదు. సెల్లర్ పాయింట్ ( Seller Point ) వద్ద కార్డు స్వైప్ చేయవచ్చు లేదా బ్యాంకు పేమెంట్స్ కూడా చేయవచ్చు.


రివార్డులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ( Reward, Cashback and Offers ): 
ప్రతీ క్రెడిట్ కార్డు కొన్ని స్పెషల్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ అందిస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి కొన్ని షాపింగ్ వెబ్‌సైట్స్ ( Online Shopping Websites ) క్రెడిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ( Cash Back Offer ) చేయడం గురించి తెలిసిందే. ( Also Read
Covid-19 Tests: ఆమెరికా తరువాత భారత్‌లోనే అత్యధిక కోవిడ్-19 పరీక్షలు )


ఏటిఎం విత్ డ్రా: ( ATM Withdrawals )
డెబిట్ కార్డుతో పాటు క్రెడిట్ కార్డుతో కూడా ఏటిఎం నుంచి క్యాష్ విత్ డ్రా ( Withdrawal From ATM ) చేసుకోవచ్చు. అయితే దీని కోసం నామినల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎన్నో బ్యాంకులు క్యాష్ విత్ డ్రా చేస్తే రివార్డు పాయింట్స్ అందిస్తున్నాయి. 


ప్రపంచవ్యాప్త చలామణి: ( World Wide Acceptance )
ప్రపంచవ్యాప్తంగా క్రెడిట్ కార్డులు చెలామణి అవుతాయి. ఒక్క క్రెడిట్ కార్డు ఉంటే ఎక్కడైనా మీరు బతికేయోచ్చు అని కూడా అంటుంటారు. విదేశీ ప్రయాణం చేస్తున్న సమయంలో మీకు డెబిట్ కార్డు ( Debit Card ) కన్నా క్రెడిట్ కార్డు వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి. నగదు చెలామణి గురించి అంతగా ఆలోచించే అవసరం కూడా ఉండదు.


అత్యవరసర పరిస్థితిలో: ( Immediate Exigencies )
అత్యవసర పరిస్థితిలో క్రెడిట్ కార్డు ఆదుకుంటుంది. చేతిలో డబ్బు లేకున్నా క్రెడిట్ కార్డుతో పేమెంట్స్ ( Credit Card Payment ) చేసుకోవచ్చు. మీరు మెడికల్ బిల్స్ ( Medical Bills ) కూడా సులభంగా చెల్లించవచ్చు.


క్రెడిట్ స్కోర్: ( Credit Card Score )
క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలి అనుకునేవారికి క్రెడిట్ కార్డ్ లావాదేవీలు ( Credit Card Transactions ) బాగా ఉపయోగపడతాయి. క్రెడిట్ కార్డ్ బిల్స్‌ను టైమ్కు చెల్లించి క్రెడిట్ స్కోర్‌ను ( Credit Score ) పెంచుకోవచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రడిట్ స్కోర్ను బట్టి లోన్స్ ఇస్తుంటాయి.


Instagram Shop Page: షాపింగ్ ఫేజ్ లాంచ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్


Arogya Setu: ఆరోగ్యసేతుకు ఆరుదైన ఘనత


EMI REFUND : కట్ అయిన EMI తిరిగి రావాలంటే ఇలా చేయండి


Follow us on twitter