Bihar Assembly election 2020: బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీకి కరోనా
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) వేడి తారస్థాయికి చేరింది. వారంలో బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ (BJP) నాయకుల్లో కరోనా భయం పట్టుకుంది.
Bihar election: Deputy CM Sushil Kumar Modi tests positive for COVID-19: న్యూఢిల్లీ: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) వేడి తారస్థాయికి చేరింది. వారంలో బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ (BJP) నాయకుల్లో కరోనా భయం పట్టుకుంది. బీజేపీ జాతీయ నాయకుడు, అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్‌కు సోకిన మరుసటి రోజే మరో కీలక నేతకు కూడా కరోనా ( coronavirus ) పాజిటివ్‌గా తేలింది. ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా పర్యటిస్తూ.. బహిరంగసభల్లో పాల్గొంటున్న బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ (Bihar Deputy CM Sushil Kumar Modi) కు కూడా గురువారం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన పాట్నా ఎయిమ్స్ (AIIMS) లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు సుశీల్ కుమార్ మోదీ కూడా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
తనకు చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్ తేలిందని.. పరిస్థితి అంత సాధారణంగా ఉందని.. గత 2 రోజులుగా తేలికపాటి జ్వరం ఉన్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. మెరుగైన పర్యవేక్షణ కోసం పాట్నాలోని ఎయిమ్స్‌లో చేరాను.. ఊపిరితిత్తుల స్కానింగ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం త్వరలోనే తిరిగి వస్తానంటూ.. సుశీల్ కుమార్ మోదీ ట్విట్ చేసి తెలిపారు. అయితే బీహార్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీతోపాటు.. షానవాజ్ హుస్సేన్ కూడా పాల్గొన్నారు. అయితే ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంలో పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. Also read: Tejashwi Yadav: సీఎం అభ్యర్థికి చేదు అనుభవం
ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబరు 10న ఫలితాలు వెలువడనున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలో బీజేపీ, జేడీయూ ఎన్డీఏ కూటమిగా కలిసి పోటీచేస్తుండగా.. మాజీ సీఎం లాలు కుమారుడు తేజస్వీ సారథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి మహాకూటమిగా ఎన్నికల్లో దిగాయి. దీంతోపాటు శివసేన కూడా 50 సీట్లల్లో పోటీచేస్తుండగా.. ఎన్డీఏ కూటమిలోని చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగింది. Also read: Lalu Prasad Yadav: బీహార్ మాజీ సీఎం లాలూకు బెయిల్.. కానీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe