Bihar Boat Accident: బిహార్‌లో ఘోరం.. పడవ బోల్తా, 16 మంది విద్యార్థులు గల్లంతు
బిహార్ లోని ముజఫర్ పూర్ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు గురువారం సీఎం నితీష్ కుమార్ అక్కడికి వెళ్లే సమయంలో ఒక దురదృష్ట ఘటన చోటు చేసుకుంది. 33 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో విషాదచాయలు అల్లుకున్నాయి.
Bihar Boat Accident: బిహార్ లో ఘోర ప్రమాదం సంభవించింది. 33 మంది పిల్లలతో వెళ్తున్న ఓ పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ముజఫర్ ఫూర్ జిల్లాలో ఈ ప్రమాదకర ఘటన జరిగింది. బాగ్‌మతి నదిలో ప్రయాణిస్తున్న క్రమంలో ఈ పడవ ప్రమాదానికి గురైంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే మునిగిపోయిన 17 మంది చిన్నారులను రక్షించారు. మిగిలిన విద్యార్థుల కోసం అధికారులు గాలిస్తున్నారు.
బిహార్ లోని గైఘాట్ బెనియాబాద్ ఓపీ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బ్యాలెన్స్ కోల్పోయి ఈ బోట్ మునిగిపోయిందని తెలుస్తోంది. సీఎం నితీష్ కుమార్ పర్యటన నేపథ్యంలో ఈ పెను ప్రమాదం జరిగిందని సమాచారం. రెస్క్యూ టీమ్ తో పాటు స్థానికులు కూడా సహాయకచర్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు 17 మంది పిల్లల్ని స్థానికులు రక్షించగా.. 16 మంది గల్లంతయ్యారు.
గైఘాట్, బెనియాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి సహాయక చర్యలను చేపట్టారు. పిల్లలు అందరూ పడవలో స్కూలుకు వెళ్తున్నారని అధికారులు వెల్లడించారు. బోట్ ప్రమాదం జరిగిన సంగతి తెలుసుకున్న పిల్లలు తల్లీదండ్రులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. చిన్నారులను రక్షించేందుకు నదిలోకి దూకి వెతులాడుతున్నారు. వెంటనే స్పందించడం కారణంగా ఘటనా కొంత మంది పిల్లల్ని అయినా కాపాడగలిగారని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన పిల్లల తల్లీదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి.
Also Read: Chandrababu Arrest: చంద్రబాబుకు మళ్లీ నిరాశ, బెయిల్‌పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు
కారణం ఏంటి..?
బిహార్ లోని ముజఫర్ పూర్ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు గురువారం సీఎం నితీష్ కుమార్ రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టం అని స్థానికులు అంటున్నారు. అయితే పడవ బోల్తా పడిన నేపథ్యంలో.. పోలీసులు, అధికారులు ముందస్తుగా తగిన జాగ్రత్తలు పాటిస్తే.. ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం నితీష్ కుమార్ రాకలో బిజీగా ఉన్న పోలీసులు అధికారులు పడవ బోల్తా పడిన ఘటనను సీరియస్ గా తీసుకోలేదని అక్కడి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేసారు. పడవ బోల్తా విషయాన్ని స్థానిక పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టుంటే బాగుండేదని గ్రామస్థులు వాపోయారు.
Also Read: Whatsapp Video Call: చిరు వ్యాపారికి వలపు వల.. తియ్యని మాటలతో నగ్నంగా మార్చి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook