బిహార్(Bihar) లో లాలూ ప్రాసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) పార్టీ ఆర్జేడీ (Rashtriya Janata Dal)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections 2020), వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఐదుగురు ఆర్జేడీ ఎమ్మెల్సీలు సీఎం నితీష్ కుమార్ పార్టీ (Nitish Kumar) జేడీయూ ( Janata Dal United)లో చేరారు. అంతేకాకుండా ఆర్జేడీ వ్యవస్థాపక సభ్యుడు, ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ (Raghuvansh Prasad Singh) కూడా  పార్టీకి రాజీనామా చేయడంతో బిహార్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వంద శాతం ఫలితాలతో వస్తున్న పతంజలి కరోనా మెడిసిన్ Coronil.. ధరెంతో తెలుసా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జులై 7న బిహార్‌లో తొమ్మిది స్థానాలకు జరగనున్న ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలకు ముందు మంగళవారం ఆర్జేడీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు సంజయ్ ప్రసాద్, దిలీప్ రాయ్, ఎండి కమర్ ఆలం, రాధా చరణ్ షా, రణ్విజయ్ కుమార్ సింగ్ జేడీయూలోకి జంప్ అయ్యారు. అయితే ఈ ఐదుగురు ఎమ్మెల్సీలను ఒక ప్రత్యేక గ్రూపుగా పరిగణించి జేడీయూలో విలీనానికి ఆమోదం తెలిపినట్లు విధాన పరిషత్ యాక్టింగ్ చైర్మన్ అవధేష్ నరైన్ సింగ్ తెలిపారు. దీంతో ఎనిమిది ఎమ్మెల్సీలు ఉన్న ఆర్జేడీ బలం ఇప్పుడు మూడుకు పడిపోయింది. జేడీయూ, బీజేపీ కూటమికి ఇప్పటికే 41మంది ఎమ్మెల్సీల బలం ఉండగా .. ఈ ఐదుగురు చేరడంతో ఈ సంఖ్య 46కి పెరిగింది. 75 సీట్లు ఉన్న బిహార్ శాసనమండలిలో 29సీట్లు ఖాళీగా ఉన్నాయి.  అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి


రఘువంశ్ ప్రసాద్ సింగ్ రాజీనామా..
కరోనా బారిన పడి పట్నాలోని ఎయిమ్స్ (Patna AIIMS)లో చికిత్స పొందుతున్న ఆర్జేడీ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. తన శత్రువును పార్టీలోకి చేర్చుకుంటున్నారని, ఇది తగదంటూ పార్టీ వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మాఫియా డాన్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన రామా కిషోర్ సింగ్ (Rama Kishore Singh) 2014 లోక్ సభ ఎన్నికల్లో రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీ(LJP) నుంచి వైశాలిలో పోటీచేసి రఘువంశ్ ప్రసాద్ సింగ్‌పై విజయం సాధించడం తెలిసిందే. అయితే బిహార్లో ఎన్నికలకు ముందు ఫిరాయింపులు మొదలవ్వడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ