Bihar, Jharkhand, Uttar Pradesh have emerged as the poorest states in India: దేశంలో పెదరికంపై నీతి ఆయోగ్​ కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా.. బిహార్​, జార్ఖండ్​, ఉత్తర్ ప్రదేశ్​లు అత్యంత పేద రాష్ట్రాలు (Poorest states in India) అని తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన మల్టీడైమెన్షనల్​ పావర్టి ఇండెక్స్ (ఎంపీఐ) ద్వారా (Niti Aayog Poverty report) పలు వివరాలు తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంపీఐ సూచీలోని వివరాలు ఇలా..


బీహార్​లో సగానికిపైగా (51.91 శాతం) మంది పేదరికంలో (Bihar poorest state in India) ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాతి స్థానంలో ఝార్ఖండ్ ఉన్నట్లు తెలిపింది. ఝార్ఖండ్లో 42.16 శాతం మంది పేదలని తెలిపింది. 37.79 శాతం పేదలతో ఉత్తర్​ ప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నట్లు వివరించింది.


36.65 శాతం మంది పేదలతో మధ్యప్రదేశ్​ నాలుగో స్థానంలో స్థానంలో, 32.67 శాతం మంది పేదలతో మేఘాలయ ఐదు స్థానాల్లో ఉన్నాయి.


పేదలు తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇవే..


అత్యంత తక్కువ పేదలు ఉన్న రాష్ట్రాల జాబితాలో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 0.71 శాతం మంది మంత్రమే అత్యంత పేదలు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో గోవా (3.76 శాతం), సిక్కిం (3.82 శాతం), తమిళనాడు (4.89 శాతం), పంజాబ్ (5.59 శాతం) ఉన్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో ఇలా..


తెలంగాణ జనాభాలో 13.74 శాత మంది పేదలు ఉన్నట్లు నివేదికలో తేలింది. దీనితో ఈ నివేదికలో తెలంగాణ 18వ స్థానంలో (Poverty rate in Telangana) నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్​లో 12.31 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నట్లు తెలిసింది. ఫలితంగా ఏపీ ర్యాంక్ 20గా (Poverty rate in AP) ఉంది.


కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికొస్తే..  దాద్రా నగర్‌ హవేలీలో అత్యధికంగా 27.36 శాతం మంది పేదలు ఉన్నారు. పుదుచ్చేరిలో 1.72 శాతంం మంది పేదరికంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.


పౌష్టికాహార లోపంలోను బిహార్​దే అగ్రస్థానం..


పౌష్టికాహార లోపం విషయంలో కూడా బిహార్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జార్ఖండ్​, మధ్యప్రదేశ్​, ఉత్తర్​ ప్రదేశ్​లు ఉన్నాయి.


Also read: International Flights: డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో అంతర్జాతీయ విమానయాన సేవలు!


Also read: Navy officer: కుటుబంతో విహార‌యాత్ర‌కు వెళ్లి.. స‌ముద్రంలో శవమై తేలిన నేవీ అధికారి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook