Bird flu outbreak: కరోనా వైర‌స్..బ్రిటన్ కరోనా వైరస్ కాదిప్పుడు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ అలియాస్ బర్డ్ ఫ్లూ వైరస్  కలకలం రేపుతోంది. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల్ని అప్రమత్తం చేస్తూనే..రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది కేంద్రం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా కొత్త స్ట్రెయిన్ ( New coronavirus strain ) ‌తో రేగిన ఆందోళన తగ్గకముందే ఇప్పుడు బర్డ్ ఫ్లూ ( Bird Flu ) అలియాస్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ( Avian Influenza virus ) కలకలం అధికమవుతోంది. ఇప్పటికే  పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, వన్యప్రాణి విభాగాల్ని, దేశంలోని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దేశంలోని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర వన్యప్రాణి విభాగం ఐజీ రోహిత్ తివారీ లేఖ రాశారు. హిమాచల్ ప్రదేశ్ ( Himachal pradesh ) ‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో వలస పక్షులతో సహా ఇతర పక్షులు చనిపోతున్నాయి. వాటి శాంపిల్స్‌ను ఐసీఏఆర్- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపించి పరీక్షించగా.. హెచ్5ఎన్1 ( H5N1 ) ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని..కేంద్రం తెలిపింది. 


Also read: AR Rehman: ఏఆర్ రెహమాన్ ఇండియాకు ఎందుకు తిరిగొచ్చారు ? దిలీప్ కుమార్ పేరంటే ఎందుకిష్టం లేదు ?


ఈ నేపధ్యంలో ఈ వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశాలున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని..పక్షులను పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూ పెంచడమే కాకుండా నిఘా ఉంచాలని కేంద్రం ( Central Government ) సూచించింది. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో పక్షులు కూడా ఈ వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ నేపధ్యంలో తెలంగాణ ( Telangana ) అటవీ శాఖ సైతం అప్రమత్తమైంది. జూ పార్క్‌లతో పాటు, అటవీ ప్రాంతంలో ఏవైనా అసహజ మరణాలుంటే నమోదు చేసి..పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలని ఆదేశించారు. ఈ సీజన్‌లో వలస పక్షుల సంచారం ఉంటుందని..కాబట్టి వాటిని కూడా పర్యవేక్షించాలని తెలిపారు. ఎవరివద్దనైనా దీనికి సంబంధించి సమాచారముంటే..అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్‌ 18004255364కు ఫోన్ చేయాలని కోరారు.


Also read: Jammu kashmir snowfall: నిజంగా భూతల స్వర్గమే..అత్యద్భుతమైన అందాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook