Bird flu scare continues in Maharashtra | ముంబై: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో నిత్యం వందలాది పక్షులు మృతి చెందుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో 382 పక్షులు బర్డ్ ఫ్లూ వల్ల మరణించాయి. దీంతో మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ సోకి మరణించిన పక్షుల సంఖ్య 3,378 కి పెరిగింది. దీంతోపాటు కొత్తగా లాతూర్, నాందేడ్, నాసిక్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో (Maharashtra) గురువారం (జనవరి 14న) 382 పక్షులు మరణించడంతో వీటి నమూనాలను భోపాల్, పూణే నగరాల్లోని జాతీయ జంతు వ్యాధుల నివారణ సంస్థలకు పంపించి పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలోని 9 జిల్లాల్లో బర్డ్ ఫ్లూ (Bird flu) కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మహారాష్ట్రలో జనవరి 8న మొదటగా బర్డ్ ఫ్లూ కేసులను నిర్థారించారు. Also Read: Budget Session: 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు


ఇదిలాఉంటే..  బర్డ్ ఫ్లూ ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం (Central government) అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరికీ అవగాహన కల్పించాలని సూచించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వాలు సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.


Also read: Farmers Protest: నేడు తొమ్మిదో దఫా చర్చలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook