BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..
BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షడు జేపీ సడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లు పాల్గొన్నారు.
BJP Manifesto 2024 Telugu: 2024 సార్వత్రిక ఎన్నికలకు 'సంకల్ప పత్రం'లో మోదీ గ్యారంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో ఈ మేనిఫేస్టోను తయారు చేసారు. ఈ మేనిఫేస్టోలో 14 అంశాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టో రూపకల్పనలో కృషి చేశారు..
బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..
70 యేళ్లు పై బడిని సీనియర్ సిటీజన్స్ (వృద్దులకు) ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ. లక్షల వరకు ఉచిత వైద్య బీమా..
-మూడు కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం..
-ట్రాన్స్‌జెండర్స్‌కు సైతం ఆయుష్మాన్ భారత్..
-మరో ఐదేళ్ల పాటు తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచిత రేషన్..
-పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా..
-ముద్ర ఋణాల పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంపు..
-దివ్యాంగులకు ప్రత్యేక ఇళ్ల నిర్మాణం..
-మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారుణిలుగా మార్చే బృహత్తర ప్రణాళిక..
-డెయిరీ సహకా సంఘాల సంఖ్యను పెద్ద సంఖ్యలో పెంపు..
-కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త కస్టర్లు..
-మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహాం..
-చేపల ఉత్పత్తికి ప్రత్యేక ప్రాసెసింగ్‌కు సెపరేట్ క్లస్టర్లు..
-ప్రకృతి ఆధారిత వ్యవసాయానికి ప్రాధాన్యం..
Read More: Sonu Sood: షూ చోరీ చేసిన స్విగ్గీ డెలీవరీ బాయ్ కు సోనూసూద్ అండ.. కొత్త బూట్లు కొనివ్వండంటూ ట్వీట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter