Parliament:  పార్లమెంట్ ఆవరణలో గురువార గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. రాజ్యాంగ  నిర్మాత అంబేడ్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అటు అంబేడ్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపణలు చేస్తూ అధికర పక్షం కూడా నిరసన చేపట్టింది. దీనిలో భాగంగా పార్లమెంట్ లోనికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్షనేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఒడిశాకు  చెందిన బీపీప ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కిందపడటంతో ఆయనకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధికారపక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు స్వల్పగాయం అయ్యింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ..నేను మెట్ల దగ్గర నిల్చున్నాను..రాహుల్ గాంధీ, ఓ ఎంపీని నెట్టేశారు. ఆ ఎంపీ వచ్చి నాపై పడటంతో నేను కిందపడిపోయాను అని ఆరోపించారు. 


Also Read: EPFO: ఈపీఎఫ్ గుడ్ న్యూస్.. అధిక పింఛన్ వివరాల అప్ లోడ్ గడువు పెంచిన ప్రభుత్వం


అయితే ఈ ఘటనపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. జరిగింది అంతా కూడా మీ కెమెరాల్లో రికార్డు అయ్యి ఉంది. అది చూడండి. నేను పార్లమెంట్ లోపలికి వస్తున్న క్రమంలో బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నన్ను పక్కకు తోసేశారు. బెదిరించారు. నన్నే కాదు మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారు. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉంది. కానీ వారు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇక్కడ సమస్య ఏందంటే రాజ్యాంగంపై బీజేపీవాళ్లు దాడి చేస్తున్నారు. అంబేడ్కర్ ను అవమానించారు అని రాహుల్ ఫైర్ అయ్యారు. 


Also Read:  Special FD: ఈ బ్యాంకుల్లో స్పెషల్ స్కీమ్స్..అధిక వడ్డీ గ్యారెంటీ..కొన్ని గంటలే సమయం..త్వరపడండి


ఈ ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయానలి బీజేపీ యోచిస్తోన్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. 


 


 





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook