Special FD: కస్టమర్లను ఆకట్టుకునేందుకు బ్యాంకులు ప్రత్యేక కాలపరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తుంటాయి. అయితే ఇవి లిమిటెడ్ టైం వరకే అందుబాటులో ఉంటాయి. ఆ విధంగా రెండు బ్యాంకులు తీసుకువచ్చిన ప్రత్యేక టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్ల గడువు ఈ డిసెంబర్ 31వ తేదీతో ముగుస్తున్నాయి. ఆలోపు డిపాజిట్ చేసిన వారికి వడ్డీ ఎక్కువగా వస్తుంది. ఈ స్పెషల్ టెన్యూర్ టర్మ్ డిపాజిట్ల ద్వారా గరిష్టంగా 8.10శాతం వడ్డీ పొందేందుకు ఛాన్స్ ఉంటుంది. మరి ఆ బ్యాంకులు ఏవి. ఏ టెన్యూర్ డిపాజిట్లపై ఎంత వడ్డీ అందిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఐడీబీఐ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ డెడ్ లైన్:
ఐడిబీఐ బ్యాంక్ తీసుకువచ్చిన ఉత్సవ్ ఎఫ్డీ స్కీము గడువు డిసెంబర్ 31, 2024తో ముగియనుంది. ఉత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్లో 300రోజులు, 375 రోజులు, 444రోజులు, 700 రోజులు టెన్యూర్ తో ఎక్కువ వడ్డీ రేట్లు కల్పిస్తుంది. జనరల్ కస్టమర్లకు వరుసగా 7.05 శాతం, 7.24వాతం, 7.35శాతం, 7.20శాతం వడ్డీ రేట్లు కల్పిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.85శాతం వడ్డీని అందిస్తోంది.
పంజాబ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ డెడ్ లైన్ :
పంజాబ్ & సింధ్ బ్యాంక్ చాలా ప్రత్యేక FDలను కలిగి ఉంది. ఇవి తక్కువ సమయంలో పెట్టుబడిదారులను ధనవంతులను చేయగలవు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌కు చెందిన ధనలక్ష్మి అనే ఈ ప్రత్యేక FDలో పెట్టుబడి వ్యవధి 444 రోజులు. ఈ FDలో, సాధారణ పౌరులకు 7.4% సీనియర్ సిటిజన్లకు 7.9% వడ్డీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05% వడ్డీ లభిస్తోంది. పంజాబ్, సింధ్ బ్యాంక్ 222 రోజులు, 333 రోజుల ప్రత్యేక FDని కూడా కలిగి ఉంది. ఈ FDలలో పెట్టుబడి పెట్టడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే సమయం ఉంది.
పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ ప్రత్యేక FD:
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తన కస్టమర్లకు 222 రోజులు, 333 రోజులుచ 444 రోజుల ప్రత్యేక FDలను అందిస్తోంది. ఈ స్పెషల్ స్కీముపై వడ్డీ గరిష్టంగా 8.05 శాతం వడ్డీ లభిస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, బ్యాంక్ 222 రోజుల ఎఫ్‌డిపై 7.05 శాతం, 333 రోజుల ఎఫ్‌డిపై 7.10 శాతం మరియు 444 రోజుల ఎఫ్‌డిపై 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు 444 రోజుల FDపై బ్యాంక్ 8.05 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 0.50 శాతం అదనపు వడ్డీని ఇస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.50 శాతానికి అదనంగా 0.15 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.