బీహార్ ( Bihar ) ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ సంవత్సరం జరగనున్న ఈ ఎలక్షన్స్ కోసం రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటి నుంచే వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఎవరిని బరిలోకి దింపితే గెలుస్తామో నిర్ణయించడమే కాకుండా.. ఎవరికి ముందుంచితే ఓట్లు పడతాయో పార్టీలు నిర్ణయిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ALSO READ | UPSC Notification 2020: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ


మొత్తం 30 మంది...


ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ 30 సభ్యలతో కూడిన స్టార్ క్యాంపేనర్ జాబితాను విడుదల చేసింది. వీరిలో ప్రధాని మోదీ (PM Modi ) , హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు రాజ్ నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఉన్నారు. 



 



ప్రముఖ నేతలంతా...
లిస్టును గమనిస్తే... బీహార్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ( BJP  ) చాలా సీరియస్ అంశంగా తీసుకుంది అని అర్థం అవుతోంది. బీజేపీ కీలక నేతలంతా ప్రచారంలో భాగం అవ్వనున్నారు. వీరితో పాటు పలువురు ప్రజాకర్షణ కల సెలబ్రిటీలను కూడా ప్రచారానికి తీసుకెళ్లే అవకాశం ఉంది అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కాగా కరోనావైరస్ సంక్రమణను గమనించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లతో ఎన్నికలు నిర్వహించనుంది అని తెలుస్తోంది. Also Read: RGV : ఒబామా, ట్రంప్ మధ్య తేడాలేంటో చెప్పే ఆర్జీవి వీడియో


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR