Boy Bites Snake: ఇదెక్కడి పగరా అయ్యా.. పాము కరిచిందని, దాని పీక కొరికి చంపిన బాలుడు!
Boy Bites Snake Head: తనను కరిచి పోతున్న పామును బలంగా పట్టుకుని పీక కొరికాడు ఒక పన్నెండేళ్ల బాలుడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలలోకి వెళితే
Boy Bites Snake Head By Teeth After Being Bitten: పాములను చూస్తే సాధారణ జనం చాలా భయపడుతూ ఉంటారు, కొందరైతే పాము అనే పదవి వినడానికి కూడా వణికిపోతూ ఉంటారు. అలాంటి ఒక పాము వచ్చి మిమ్మల్ని కరిస్తే మీరు ఏం చేస్తారు దాదాపుగా అందరూ వణికి పోతారు కదా, ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక 12 ఏళ్ల కుర్రాడు మాత్రం తనను కాటేసిన పాము మీద పగపట్టాడు. తనను కాటేసి అక్కడ నుంచి జర జరా పాకుకుంటూ వెళ్ళిపోతున్న పామును పట్టుకోవడమే కాక ఆ విష సర్పాన్ని తన పంటితో కరిచి చంపేశాడు. ఇదంతా చూసిన సదరు 12 ఏళ్ల బాలుడి తల్లిదండ్రులు వెంటనే షాక్ అయ్యి అతన్ని, పాముని హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు.
హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత పాము విషానికి విరుగుడు మందు ఇచ్చి డాక్టర్ చిన్నారిని కాపాడారు. కానీ అతని పంటి కాట్ల వల్ల పాము మృతి చెందింది. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లోని జష్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. జష్పూర్ గార్డెన్ బ్లాక్ లోని పండారపత్ అనే ప్రాంతంలో నివసిస్తున్న పహారి కోరువ అనే కుటుంబానికి చెందిన 12 ఏళ్ల దీపక్ కొంత దూరంలో నివాసం ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్ళాడు. అక్కడే మిగతా పిల్లలతో ఆడుకుంటూ ఉండగా అతని పాము కాటు వేసింది. దీంతో దీపక్ కి చాలా కోపం వచ్చి కాటేసి వెళ్ళిపోతున్న పాముని పట్టుకుని తన కసి తీరా కొరికాడు. అయితే ఛత్తీస్గఢ్ లోని సదరు జిల్లాలో పాము కాటేస్తే మనకి ఏమీ కాదనే ఒక నమ్మకం ఉందట.
అది కూడా నాగుల చవితి సమయంలో కాటేయడంతో తనకు ఏమీ కాదనే ఉద్దేశంతో సదరు చిన్నారి తిరిగి పాముని కరిచినట్లు చెబుతున్నారు. అయితే సకాలంలో హాస్పిటల్ కి తీసుకు వెళ్లడంతో దీపక్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సందర్భంగా దీపక్ ను మీడియా ప్రశ్నిస్తే తాను ఆడుకుంటున్న సమయంలో ఒక పాము వచ్చి కాటేసిందని, తనకు కోపం రావడంతోనే పామును కరిచానని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తే హాస్పిటల్ కి తీసుకు వెళ్లారని అన్నాడు. ఛత్తీస్‌గఢ్‌కు బోర్డర్లో ఉన్న జష్‌పూర్ జిల్లా ఫార్స్‌బహార్ తహసీల్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాలను అక్కడి వారు నాగలోకం అని అని పిలుస్తారు.
కింగ్ కోబ్రా, కరైట్ వంటి చాలా విషపూరితమైన పాములు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఒడిశాతో కలిపే స్టేట్ హైవే వెంబడి ఉన్న తప్కారా అలాగే దాని చుట్టుపక్కల గ్రామాల్లో కనిపిస్తాయి. జష్‌పూర్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతంలో 70కి పైగా రకాల పాములు కనిపిస్తాయని, వీటిలో నాలుగు రకాల నాగుపాములు, మూడు అత్యంత విషపూరిత జాతుల పాములు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కనిపించే అన్ని రకాల పాములలో 80% పాములు జష్‌పూర్‌లో ఉన్నాయని పాములను రెస్క్యూ చేసే కేసర్ హుస్సేన్ వెల్లడించారు. జష్‌పూర్‌లో మొత్తం 26 రకాల పాము జాతులు కనిపిస్తాయి కానీ వాటిలో ఆరు జాతులు మాత్రమే విషపూరితమైనవి, మిగిలిన 20 రకాల పాము జాతులలో విషం లేదని ఆయన అన్నారు. ఇక జష్‌పూర్‌లో మూడేళ్లలో 35 మంది పాముకాటుకు గురయ్యారు. 2017లో పాము కాటుతో 16 మంది చనిపోయారు. 2018లో పాముకాటుతో 6 మంది చనిపోగా, 2019లో 12 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook