దేశమంతా ఎదురుచూస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఒకేసారి ప్రారంభం కానుంది. దేశమంతా ఒకేసారి ప్రారంభించేందుకు వీలుగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇండియన్ రైల్వేస్ ( Indian railways ) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు ( Bullet rail project ) పురోగతిని రైల్వే బోర్డు వివరించింది. ఈ ప్రాజెక్టును దేశమంతా ఒకేసారి ప్రారంభిస్తామని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ చెప్పారు.  రైల్వే లైన్ కోసం ఇప్పటివరకూ 949 హెక్టార్ల భూ సేకరణ పూర్తయిందని..మహారాష్ట్ర ( Maharashtra ) లో ఇంకా భూ సేకరణ పూర్తి కావల్సి ఉందని చెప్పారు.  భూ సేకరణ పూర్తయితే తప్ప..టెండర్లు ఆహ్వానించలేమని రైల్వే బోర్డు ఛైర్మన్ స్పష్టం చేశారు. 


రైల్వే శాఖ మహారాష్ట్ర అధికారులతో చాలా సార్లు చర్చించిందని..రానున్న 4 నెలల్లో 80 శాతం కంటే ఎక్కువ భూ సేకరణ జరగవచ్చని చెప్పారు. భూ సేకరణ పూర్తయి..టెండర్లు ఆహ్వానిస్తే..రెండు దశల పనులు ఒకేసారి మొదలవుతాయన్నారు. మహారాష్ట్రలో ఆలస్యమైతే మాత్రం మొదటి దశలోని 325 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న వాపి ( Gujarat ) వరకూ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 


మహారాష్ట్రలో ఇంకా 26 శాతం భూమి కావాలని చెప్పారు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ ( Railway board chairman vk yadav ). 508.17 కిలోమీటర్ల పొడుగున్న బుల్లెట్ రైల్ కారిడార్‌లో 155.17 కిలోమీటర్లు మహారాష్ట్రలోనూ..348.04 కిలోమీటర్లు గుజరాత్‌లోనూ మరో 4.3 కిలోమీటర్ల లైను దాద్రానగర్‌లోనూ ఉంటుందన్నారు. దేశంలోని నాలుగు శైవ క్షేత్రాల్ని కలుపుతూ రైల్వే లైన్ డిజైన్ చేస్తున్నామని చెప్పారు. 2024 నాటికి రుషికేశ్-కర్న్‌ప్రయాగ్ రైలు లింక్ పూర్తవుతుందన్నారు. అటు రామేశ్వరం ( Rameswaram ) ఆధునిక పంబన్ బ్రిడ్జి వచ్చే యేడాది అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. 2022 డిసెంబర్ నాటికి తొలి లోకో మోటివ్ రైలు ప్రారంభిస్తామని చెప్పారు. 


Also read: FASTag: ఒక్కరోజులోనే 80 కోట్లు దాటిన ఫాస్టాగ్ టోల్ ఆదాయం