CBSE Board exams 2020 cancelled: న్యూ ఢిల్లీ: సీబీఎస్ఇ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్రం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూలై 1 నుంచి 15 వరకు సీబీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతి పరీక్షలు ( CBSE 10th, CBSE 12th class exams) జరగాల్సి ఉంది. అయితే, కరోనావైరస్  ( Coronavirus ) వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో సీబీఎస్ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తే దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరయ్యే లక్షలాది మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని పలు రాష్ట్రాలు కేంద్రం, కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సీబీఎస్ఈ పరీక్షలు ( CBSE Exams ) రద్దు చేయాల్సిందిగా కోరుతూ పలు రాష్ట్రాలు కోర్టులో పిటిషన్స్ సైతం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఇ 10వ తరగతి, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్టు కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి 12వ తరగతి విద్యార్థులకు కోరుకున్న వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు. ( Also read : TS 10th Results 2020: తెలంగాణలో టెన్త్ క్లాస్ ఫలితాల కోసం క్లిక్ చేయండి )


రద్దయిన సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం cbse.nic.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇదిలావుంటే, పరిస్థితులు చక్కబడిన తర్వాత CBSE XII క్లాస్ స్టూడెంట్స్‌ అవసరం అనుకుంటే పరీక్షలు రాసుకోవచ్చు అంటూ బోర్డు ఆప్షన్ ఇవ్వడమే ప్రస్తుతం విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..