Corona Vaccination: దేశంలో వేగవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ, 38 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ
Corona Vaccination: కరోనా మహమ్మారి నియంత్రణకై కరోనా వ్యాక్సినేషన్ కరోనాప్రక్రియ దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం పెరగడంతో వ్యాక్సినేషన్ ఊపందుకుంది. దేశంలో ఇప్పటి వరకూ జరిగిన వ్యాక్సినేషన్ వివరాలివీ.
Corona Vaccination: కరోనా మహమ్మారి నియంత్రణకై కరోనా వ్యాక్సినేషన్ కరోనాప్రక్రియ దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం పెరగడంతో వ్యాక్సినేషన్ ఊపందుకుంది. దేశంలో ఇప్పటి వరకూ జరిగిన వ్యాక్సినేషన్ వివరాలివీ.
కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. దేశంలో గత కొద్దిరోజులుగా వ్యాక్సినేషన్ (Vaccination)ప్రక్రియ వేగవంతమైంది. ప్రధానంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరగడంతో వ్యాక్సిన్ లభ్యత మెరుగుపడింది. ఫలితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంది. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
దేశంలో ఇప్పటి వరకూ 38.60 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మరో 11.25 లక్షల కోవిడ్ వ్యాక్సిన్లను పంపనున్నారు. రాష్ట్రాల వద్ద ఇప్పటికే 1.44 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు స్టోరేజ్ ఉన్నాయి. దేశవ్యాప్తం వ్యాక్సిన్ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం(Central government) పంపిణీ చేస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్రమే ఉచితంగా సరఫరా చేస్తోంది. మరికొద్దిరోజుల్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్(Sputnik v vaccine), మోడెర్నా వ్యాక్సిన్, జైడస్ క్యాడిల్లా వ్యాక్సిన్ అందుబాటులో రానున్నాయి.
Also read: Covaxin vaccine: కోవాగ్జిన్‌పై త్వరలో నిర్ణయం తీసుకోనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook