Covaxin vaccine: మేకిన్ ఇండియా వ్యాక్సిన్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి విషయంలో త్వరలో నిర్ణయం వెలువడనుంది. అత్యవసర అనుమతి లేని కారణంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇండియాలో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లలో సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్(Covishield)కు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన అత్యవసర వినియోగ జాబితాలో స్థానముంది. భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్‌కు అనుమతి లేదు. ఫలితంగా కోవాగ్జిన్ తీసుకున్నవారికి విదేశీ ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయపై భారత ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థకు విజ్ఞప్తి చేసింది. కోవాగ్జిన్‌కు(Covaxin) అత్యవసర అనుమతిచ్చే విషయంలో త్వరలో అంటే ఆరు వారాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వినియోగ జాబితాలో చేర్చాలంటే..నిర్దేశిత పనితీరు ప్రదర్శించాలని..దీనికోసం ప్రపంచ ఆరోగ్య సంస్థకు కనీసం 3-4 ట్రయల్స్‌కు చెందిన వివరాల్ని అందించాల్సి ఉంటుంది.
ఇప్పటికే కోవ్యాగ్జిన్‌కు సంబంధించిన సమాచారం డబ్ల్యూహెచ్‌వో(WHO)కు చేరిందని..మరో నెలన్నరలోగా అత్యవసర వినియోగ జాబితాలో చేరే అవకాశముందన్నారు డాక్టర్ సౌమ్య స్వామినాథన్.ఇప్పటికే ఈ జాబితాలో ఫైజర్, ఆస్ట్రాజెనెకా, సీరమ్ ఇనిస్టిట్యూట్, ఆస్ట్రాజెనెకా ఈయూ, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, సినోఫార్మా వ్యాక్సిన్‌లు ఉన్నాయి. మరో 105 వ్యాక్సిన్లు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దశల ట్రయల్స్‌లో ఉండగా..ఇందులో 27 వ్యాక్సిన్లు 3-4 దశల ట్రయల్స్ పూర్తి చేసుకున్నాయి. మరో 184 వ్యాక్సిన్లు ప్రపంచంలో ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయి.
Also read: India Corona Cases: కరోనా పాజిటివ్ కేసుల కంటే Covid-19 రికవరీలే అధికం, ఇండియాలో తాజాగా 895 మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook