Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. భారీగా ఉద్యోగులకు పదోన్నతి లభించనుంది. స్వయంగా కేంద్రమంత్రి ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. సామూహిక పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని విభాగాల ఉద్యోగులకు కేంద్ర మంత్రి జితేంద్ర సింహ్ శుభవార్త విన్పించారు. మూడు సెక్రటేరియట్ సేవలకు సంబంధించిన విభాగాల్లో పనిచేసే 8 వేలకంటే ఎక్కువమందికి ఒకేసారి పదోన్నతులు కల్పించనున్నామని స్పష్టం చేశారు. సామూహిక పదోన్నతులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సెక్రటేరియట్ సేవలకు చెందిన మూడు విభాగాల్లో కేంద్ర సెక్రటేరియట్, కేంద్ర సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్ సర్వీస్, కేంద్ర సెక్రటేరియట్ లిపిక్ సర్వీస్ ఉన్నాయి. కేంద్ర మంత్రి జితేంద్ర సింహ్ సామూహిక పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ఎస్, సీఎస్ఎస్ఎస్, సీఎస్‌సీఎస్ అనేవి కేంద్ర సెక్రటేరియట్ పరిధిలో ప్రత్యేక విభాగాలుగా ఉన్నాయి.


మొత్తం ఈ మూడు విభాగాల్నించి 8 వేల 89 మందికి పదోన్నతులు కల్పించనున్నట్టు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. ఇందులో సీఎస్ఎస్ నుంచి 4,734, సీఎస్ఎస్ఎస్ నుంచి 2,966, సీఎస్‌సీఎస్ నుంచి 389 మంది ఉన్నారు. గత రెండు నెలలుగా జరిపిన పలు సమావేశాల అనంతరం పదోన్నతులపై నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వివరించారు. కోర్టు పరిధిలో కొన్ని పిటీషన్లు ఉన్నందున..రాజ్యాంగపరంగా నిపుణులతో చర్చించి సలహా తీసుకున్నామని మంత్రి జితేంద్ర సింహ్ తెలిపారు. ఉద్యోగులు నిరాశ చెందుకుండా పదోన్నతులు కల్పిస్తున్నందుకు ముందుగా ప్రధాని నరేంద్ర మోదీకు కృతజ్ఞతలు తెలిపారు. 


Also read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు..రాగల 48 గంటల్లో అక్కడే భారీ వర్షాలు..!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook