నకిలీ పాన్ కార్డులకు మోడీ సర్కార్ చెక్..
విప్లవాత్మక జీఎస్టీ బిల్లు, పాత నోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న మోడీ సర్కార్..మరో అడుగు ముందుకేసి పన్నుఎగవేత దారులకు చెక్ పెట్టేందుకు మరో కొత్త నిర్ణయం తీసుకుంది. తాజాగా 11.4 లక్షల పాన్ కార్డులను తాత్కాలికంగా చెల్లుబాటు కాకుండా చేసింది. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పాన్ కార్డు పొందినట్లు అనుమానం ఉన్నవి...అలాగే ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్నారని గుర్తించినవి వీటిలో ఉన్నాయి.
పాన్ కార్డు స్టేటస్ చెసుకోండిలా...
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎవరి పాన్ కార్డులు చెల్లుబాటులో ఉన్నయో..ఎవరివి చెల్లకుండా ఉన్నాయనే అంశంపై జనాల్లో గందరగోళం నెలకొంది. తమ తమ పాన్ కార్డులు చెల్లుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఐటీ విభాగం వీలు కల్పించింది. దీన్ని చెక్ చేసుకోవాలంటే ఇ-ఫైలింగ్ వెబ్ సైట్ లోకి వెళ్లి పరశీలించుకోవచ్చని పేర్కొంది. ఈ ఫైలింగ్ హోం పేజీలో ఉండే సర్వీసెట్ విభాగంలో ఉండే నో యువర్ పాన్ అనే లింక్ ను క్లిక్ చేసుకోవాలి. అక్కడ సూచించిన మేరకు పేరు, డేట్ ఆఫ్ బర్త్, పాన్ అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్ వంటి వివరాలను ఇవ్వాలి. ఈ తర్వాత మీ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ నమోదు చేయాల్సి ఉంది. అప్పుడు మీ పాన్ కార్డు స్టేటస్ తెలుస్తుంది. మీ పాన్ చెల్లుబాటులో ఉందో లేదో తెలుస్తుంది. మీకు అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించే వెసులుబాటు ఐటీ విభాగం కల్పించింది. ఫేక్ పాన్ కార్డులను అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ..దీనికి ప్రజలు సహకరించారని అధికారులు కోరుతున్నారు. పాన్ కార్డుకు ఆధార్ లింక్ ను తప్పనిసరి అని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.