COVID-19 Vaccines: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 50 శాతం డోసులు ఫ్రీ: మంత్రి Harsh Vardhan స్పష్టత
COVID-19 Vaccines: భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అందిస్తున్న కోవిషీల్డ్ టీకాల ధరలను ప్రకటించాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఓ ధర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాల ధరల వ్యత్యాసంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శించాయి.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో టీకాల మూడో దశ వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అందిస్తున్న కోవిషీల్డ్ టీకాల ధరలను ప్రకటించాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఓ ధర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాల ధరల వ్యత్యాసంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శించాయి.
మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా టీకాలు ఇవ్వడంపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం అందించనున్న 50 శాతం టీకా మోతాదులను ఉచితంగా అందించనున్నామని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. మిగతా 50 శాతం రాష్ట్రాల COVID-19 టీకాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తమ వంతుగా సగం టీకాలను ఉచితంగా అందించి సహాయం చేస్తుందన్నారు. ఆరోగ్యం అనేది రాష్ట్రాల జాబితాలోకి వస్తుందన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కరోనా మహమ్మారిపై పోరాటం కొనసాగిస్తుందన్నారు.
Also Read: Telangana COVID-19 Cases: తెలంగాణలో 4 లక్షలు దాటిన కేసులు, 2 వేలు దాటిన మరణాలు
ప్రస్తుత పాలసీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం తమ వంతుగా రాష్ట్రాలకు వ్యాక్సిన్ మోతాదులు, కరోనా నిర్ధారణ పరీక్షల కిట్లు సమకూర్చిందని మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సాధ్యమైనంతగా వినియోగించుకుని కరోనాపై పోరాటంలో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్‌లో టీకాలు తీసుకునే సామర్థ్యం ఉన్నవారు తీసుకుంటే ఏ ఇబ్బంది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ల(Corona Vaccine)ను నేరుగా ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసుకునేందుకు పాలసీలో మార్పులు చేయగా, రాష్ట్రాలు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు. తమకు అవసరం ఉన్న మోతాదులకు అనుగుణంగా సంస్థలతో చర్చించి ధరలు తగ్గించుకోవచ్చునని సలహా ఇచ్చారు.
Also Read: India Covid-19 Cases: కరోనా ఎఫెక్ట్, భారత్ నుంచి విమానాలపై మరో దేశం నిషేధం
ఎలాగూ కేంద్ర ప్రభుత్వం 50 శాతం డోసులు ఉచితంగా తమ వాటాగా ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీకాలు ఎప్పుడు, ఎవరికి, ఎలా ఇస్తున్నామనే దానిపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత ఉందని, అందువల్లే తమ ప్రక్రియ సులభతరం అయిందని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం వ్యాక్సిన్ల మోతాదు కోసం ఎదురుచూస్తున్నాయని, అయితే ప్రణాళికా ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు.
https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
NetherlandsCOVID-19CoronavirusAviation MinistryInternational Flight Ban