Telangana COVID-19 Cases: తెలంగాణలో 4 లక్షలు దాటిన కేసులు, 2 వేలు దాటిన మరణాలు

Telangana COVID-19 Cases Latest News | : దేశంలో ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే లాక్‌డౌన్ దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా నెదర్లాండ్ ప్రభుత్వం భారత్ నుంచి విమానాలను నిషేధించింది. తెలంగాణలోనూ గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు భారీగా నమోదవుతున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 26, 2021, 10:27 AM IST
Telangana COVID-19 Cases: తెలంగాణలో 4 లక్షలు దాటిన కేసులు, 2 వేలు దాటిన మరణాలు

కరోనా వైరస్ రెండో దశలలో పెను ప్రభావాన్ని చూపుతోంది. దేశంలో ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే లాక్‌డౌన్ దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా నెదర్లాండ్ ప్రభుత్వం భారత్ నుంచి విమానాలను నిషేధించింది. తెలంగాణలోనూ గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 6,551 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,01,783కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 73,275 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 6 వేల 5 వందల యాభై ఒకటి మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా(CoronaVirus) పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 1 వేయి 7 వందల ఎనభై మూడుకు చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో కొత్తగా 43 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,042కి చేరింది. తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కరోనా శాంపిల్స్‌కు పరీక్షలు చేస్తోంది.

Also Read: India Covid-19 Cases: కరోనా ఎఫెక్ట్, భారత్‌ నుంచి విమానాలపై మరో దేశం నిషేధం

రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి 3,804 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,34,144 మంది కరోనా మహమ్మారిని జయించారు. భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వైద్య శాఖ, వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఇటీవల నిర్ణయాన్ని వెల్లడించింది.

Also Read: Gold Price In Hyderabad: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, దిగొచ్చిన Silver Price

జీహెచ్ఎంసీలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజా కేసులలో GHMC పరిధిలో 1,418 కోవిడ్19(COVID-19) కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని అధికారులు, వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం 65 వేల 597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1,25,66,674 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. ప్రతి 10 లక్షల మందిలో 3,37,632 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తాజా ప్రకటనలో తెలిపారు.

Also Read: New COVID-19 Guidelines: మే 1 నుంచి మూడో దశలో కరోనా వ్యాక్సినేషన్, కేంద్రం మార్గదర్శకాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News