వరదల్లో ఆర్మీ బస్సు ( Army bus washed away in flood ) కొట్టుకుపోయింది. అప్రమత్తమైన జవాన్లు బస్సు నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఛత్తీస్ గఢ్ ( Chhattisgarh ) రాష్ట్రంలో ఆర్మీకు చెందిన సీఆర్పీఎఫ్ (CRPF ) జవాన్లకు పెను ప్రమాదం తప్పింది. బీజాపూర్ ప్రాంతానికి కూంబింగ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా...వరద నీటిలో బస్సు బోల్తాపడి కొట్టుకుపోసాగింది. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ జవాన్లు బస్సులోంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు.  


బీజాపూర్ కు వెళ్లి వస్తుండగా మల్కన్ గిరి బీజాపూర్ రహదారిని దాటాల్సి వచ్చింది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు. ఈ రహదారిపై ఆ సమయంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వరద నీటిలోంచే రహదారి దాటేందుకు ప్రయత్నించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో బస్సు ఒక్కసారిగా బోల్తాపడి...ఆ వరదలో కొట్టుకుపోసాగింది. వరద నీటిని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 


ఇటీవల రాష్ట్రంలో మావోయిస్టు కదలికలు ఎక్కువగా ఉండటంతో సీఆర్పీఎఫ్ జవాన్లు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ ( Combing operation ) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజాపూర్ కు వెళ్లింది ఓ టీమ్. అటు సరిహద్దు రాష్ట్రమైన ఏపీలో కూడా పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ చేపడుతున్నారు. Also read: మహిళల Bank account లో లక్ష రూపాయలు డిపాజిట్.. ఇందులో నిజం ఎంత ?