మహిళల Bank account లో లక్ష రూపాయలు డిపాజిట్.. ఇందులో నిజం ఎంత ?

1 lakh deposit in bank accounts of women ? న్యూఢిల్లీ: మహిళల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం రూ. లక్ష రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతోందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. మహిళ స్వరోజ్‌గార్ యోజన పథకం ( Mahila swarozgar yojana ) కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం రూ. లక్ష రూపాయలు జమ చేస్తోందనేది ఆ వదంతుల సారాంశం.

Updated: Sep 21, 2020, 11:05 PM IST
మహిళల Bank account లో లక్ష రూపాయలు డిపాజిట్.. ఇందులో నిజం ఎంత ?
Representational image

1 lakh deposit in bank accounts of women ? న్యూఢిల్లీ: మహిళల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం రూ. లక్ష రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతోందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. మహిళ స్వరోజ్‌గార్ యోజన పథకం ( Mahila swarozgar yojana ) కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం రూ. లక్ష రూపాయలు జమ చేస్తోందనేది ఆ వదంతుల సారాంశం. సామాజిక మాధ్యమాలు విరివిగా వినియోగిస్తున్న ఈ రోజుల్లో అందులో ఏం పోస్ట్ చేసినా అది వెంటనే వైరల్ అవుతోందనే సంగతి తెలిసిందే. అందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండానే నెటిజెన్స్ ఆ పోస్టులను వైరల్ ( Viral social media posts ) చేస్తున్నారు. ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. దీంతో అనేక ఫేక్ న్యూస్ పోస్టులు ( Fake news posts ) కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియని అమాయక జనం.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తమ విషయంలో ఎందుకు జరగడంలో లేదని ఆందోళనకు గురవుతున్నారు. 

మహిళల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం ( Modi govt ) లక్ష రూపాయల డిపాజిట్ చేస్తున్నట్టుగా తాజాగా జరుగుతున్న ప్రచారం కూడా అలాంటిదేనని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వదంతులపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ( PIB ) స్పందిస్తూ.. కేంద్రం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టంచేసింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఫేక్ న్యూస్‌గా ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ( PIB fact check ) తేల్చిచెప్పింది. 

 

How to get messages fact-checked ఫేక్ న్యూస్ అవునో కాదో ఎలా తెలుసుకోవాలి ? :
మనకు నిత్యం అలాంటి అనుమానాస్పద సందేశాలు ఎన్నో వస్తుంటాయి. కానీ అందులో ఎంతమేరకు నిజం ఉందో తెలుసుకునే మార్గం మాత్రం అతికొద్ది మందికే తెలుసు. అదెలాగంటే.. ఇదిగో https://factcheck.pib.gov.in ఈ వెబ్‌సైట్‌లోకి మీ మెయిల్ ఐడితో లాగిన్ అవడం ద్వారా అక్కడ సూచించే పలు ఆప్షన్స్ ద్వారా ఆ సందేశాన్ని మీరు ధృవీకరించుకోవచ్చు. లేదంటే +918799711259 నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా కూడా మీకు వచ్చిన న్యూస్ నిజమా లేక అది ఫేస్ న్యూసేనా అనేది కన్ఫామ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా pibfactcheck@gmail.com కి మెయిల్ చేయడం ద్వారా కూడా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe