Chennai Heavy Rains: చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్నటి నుంచి చెన్నైలో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో తమిళనాడులో జనజీవనం అస్తవ్యస్తమౌతోంది. ఇప్పటికే చెన్నై సహా పరిసర జిల్లాల్లో స్కూల్స్, కళాశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా చెన్నై సహా పరిసర జిల్లాల్లో రెండ్రోజుల్నించి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ , మరి కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలోని పలు జిల్లాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలమైంది. చెన్నైలో దాదాపు 300 ప్రాంతాలు నీట మునిగాయి. పలు సబ్‌వేలలో మూడు అడుగుల మేర నీరు నిలిచింది. చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో కార్లు కొట్టుకుపోకుండా దగ్గరలోని ఫ్లై ఓవర్లపై పార్కింగ్ చేసుకుంటున్నారు. 


చెన్నైలో చాలా ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు చేరుకున్నాయి. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో విమానాలు, రైళ్లు రద్దు చేశారు. రేపటి వరకూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై, చెంగల్ పేట్, తిరువల్లూరు, కాంచీపురం జిల్లాల్లో అత్యవసర సేవలు మినహా అన్నీ క్లోజ్ అయ్యాయి. అటు పుదుచ్చేరిలో కూడా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. అటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అక్టోబర్ 17 వరకు పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీ తీరాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి. 


Also read: Flash Flood Warning: ఏపీలోని ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, పొరపాటున కూడా బయటకు రావద్దు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.